నీ జీనూ ప్యాంటు చూసి బుల్లమ్మో! అంటూ లిరిక్ రాశాడో సినీకవి. అప్పుడే పాశ్చాత్య సంస్కృతి ఒరవడి ఏపీలోని హైదరాబాద్ కి పాకుతున్న రోజులవి. అందుకే ఆ వర్ణన అప్పుడు ట్రెండ్ సెట్టర్ అయ్యింది. అమ్మాయిలు జీన్స్ ఫ్యాంట్ వేసుకుని తిరగడం అన్నది అప్పటికి సినిమాల్లోనే కనిపించేది. హైదరాబాద్ లాంటి చోట అడ్వాన్స్ డ్ కల్చర్ ఉన్నా మరీ ఆంధ్రా పల్లెల్లో జీన్స్ వేసుకుని తిరిగేసే అమ్మాయిలు యమలీల రీలీజ్ టైమ్ కి టూమచ్ గా లేనేలేరు. అయితే కాలంతో పాటే మార్పు. ఇప్పుడు పల్లె- పట్నం అనే తేడా లేకుండా గాళ్స్ మగాళ్లతోనే పోటీ పడుతున్నారు. ఇక లేటెస్టు గా సెలబ్రిటీ ప్రచారంలో పంచె కట్టు హాట్ టాపిక్ అయ్యిందిప్పుడు.
మోడ్రన్ వరల్డ్ లో ఏదైనా కొత్తగా చేస్తేనే ప్రచారంలో దూసుకెళ్లడం సాధ్యం కాబట్టి రౌడీ దేవరకొండ ప్రచారంలో కొత్తదనాన్ని అనుసరిస్తున్నాడు. అందుకు తగ్గట్టే ఏదో ఒకటి న్యూగా ట్రై చేసి కొన్నిసార్లు బావుందని.. మరికొన్ని సార్లు చెత్తగా ఉందని మిక్స్ డ్ రివ్యూలు అందుకున్నాడు. డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ లో రౌడీ స్టయిల్ కి తీవ్రమైన ట్రోలింగ్ సాగింది.
ఇప్పుడు మరోసారి అదే తరహాలో సోషల్ మీడియా లో ట్రోలింగ్ ఎదురైంది. ఇంతకీ అంతగా ట్రోలింగు కి గురయ్యే లా విజయ్ ఏం తప్పు చేశాడు? అంటే.. నిన్న వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీరిలీజ్ వేడుక లో అతడి పంచె కట్టు మాస్ డీగ్లామర్ స్టయిల్ కొందరికి నచ్చితే మరికొందరికి నచ్చలేదు. ఆ క్రమంలోనే ఫ్యాన్స్ తీవ్రంగానే ట్రోల్ చేస్తున్నారు. ఇదేం లుంగీ కట్టురా బాబోయ్! అని కొందరు తిట్టేస్తుంటే.. మరీ ఇంత విచిత్రంగా ఉందే! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు కొందరైతే. బుధవారం సాయంత్రం విశాఖ నగరంలో జరిగిన వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీఈవెంట్లో రౌడీ హాట్ టాపిక్ గా మారాడు. ముఖ్యంగా అతడి లుంగీ కట్టు .. తలపాగా .. మాస్ ఎక్స్ ప్రెషన్ ని వర్ణిస్తూ కొందరు ట్రోల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కొందరైతే వెరైటీని కాస్త తగ్గించాలి అంటూ సలహాలు ఇచ్చారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా రిలీజవుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ కి రౌడీ ఏదోలా బూస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నా అది ఎంతవరకూ కనెక్టవుతుందో కాస్త ఆగితే కానీ తెలీదు.