సక్సెస్ లేనిదే ఏదీ లేదు. రంగుల ప్రపంచంలో అది చాలా ఇంపార్టెంట్. కోట్లాది రూపాయల సొమ్ముల్ని మంచి నీళ్లలా వెదజల్లి సినిమా తీశాక సొమ్ము తిరిగి వెనక్కి రాకపోతే ఎలా? బోలెడంత డబ్బు తో పాటు సమయం వృధా అవ్వడమే గాక అప్పుల పాలవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ పరిశ్రమలో సాహసం చేసేవాళ్లంతా గట్స్ ఉన్న వాళ్ల కిందే లెక్క. అయితే సాహసం చేయడమే కాదు.. సినిమాతో సావాసం చేయడంలో, ప్రీప్రొడక్షన్ దశలోనే సక్సెస్ లాజిక్ అంతా బుర్రకు ఎక్కించుకుని పని చేస్తేనే విజయం సాధ్యమవుతుంది. సక్సెస్ ఫార్ములాని కనుక్కోవాలని బుర్రలు బాదుకునే వాళ్లందరికీ ఆ రహస్యం అంత తేలిగ్గా అంతు చిక్కదు. దీనిపై ఎంతో మదన పడుతుంటారు. అలాంటి వారందరికీ ఓ దారి చూపిస్తోంది గీతా ఆర్ట్స్ సంస్థ. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ అనుబంధ బ్యానర్ జీఏ2 సక్సెస్ వెనక బోలెడంత స్ట్రాటజీ ఉందని తెలుస్తోంది. ఆ ఒక్కటీ తెలుసుకుంటే నవతరం దర్శకనిర్మాతలకు అది కలిసొస్తుందనడంలో సందేహమే లేదు. 100 పర్సంట్ లవ్ - గీత గోవిందం వంటి సంచలన విజయాల్ని ఖాతాలో వేసుకున్న జీఏ2 సక్సెస్ సీక్రెట్ ఏమిటి? అని ఆరాతీస్తే తెలిసిన సంగతి ఇదీ..
జీఏ 2 సంస్థకు స్క్రిప్టు దశ నుంచే ఓ ప్రత్యేకమైన ఫార్ములా ఉంది. అక్కడ అడుగుపెట్టిన దర్శకరచయితలకు లైన్ విని ఓకే చెప్పాక అసలు కథ ఉంటుంది. ఇలా కథ వినేయగానే ఓకే అయిపోదు. అలాగే హీరో ఎవరో వెంటనే తేల్చేయరు. ఏ దర్శకుడు హీరోని డైరెక్టుగా ఎంచుకోలేరు. దర్శకుడు తొలుత స్క్రిప్టు ను పూర్తి స్థాయిలో రెడీ చేసి ఓకే చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత గీతా కాంపౌండ్ లో హీరోల అవైలబిలిటీని బట్టి అందులోంచి కథకు సరిపడే హీరోని ఎంపిక చేసుకుంటారు. హీరో కంటే ముందు స్క్రిప్టు కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. స్క్రిప్టు రెడీ అయ్యే దశలోనే ఎన్నో టెస్టింగులు ఉంటాయి. లాజిక్ లు వెతుకుతారు. కూపీలు లాగుతారు. ఒకదానికి పది సీన్లు రాయించుకుంటారు. పదే పదే రచయితలు - దర్శకుడితో కలిసి కసరత్తు తీవ్రంగా ఉంటుంది. బౌండ్ స్క్రిప్టు విషయంలో నెలల కొద్దీ సమయం తీసుకుంటారు. ఇక నిర్మాణ విలువల పరంగా అంతే క్వాలిటీ, నిబద్ధత ఉంటుంది ఇక్కడ. ఒకసారి స్క్రిప్టు వర్క్ స్టార్ట్ అయ్యింది .. అడ్వాన్స్ ఇచ్చారు అంటే ఆ సినిమా పక్కాగా సెట్స్ కెళ్లాల్సిందే. అందుకే ఇక్కడ అడుగుపెట్టే దర్శకరచయితలు కానీ, హీరో కానీ ఎవరైనా కార్పొరెట్ లో అడుగుపెట్టినట్టే. పక్కాగా పారితోషికం, భత్యం తప్పనిసరిగా అందేస్తుంది. ఇచ్చిన మాటలో తేడా ఉండదు. అందుకే జీఏ2 అంత పెద్ద సక్సెస్ అవుతోందని సన్నిహితులు చెబుతుంటారు.
ఆల్రెడీ పరిశ్రమలో ఎస్టాబ్లిష్ అయిన సంస్థ ఇలాంటి గొప్ప స్ట్రాటజీని అమల్లో పెడుతుంది కాబట్టే ఏదైనా సాధ్యమవుతోంది. ఇతర బ్యానర్లతో అగ్ర నిర్మాణ సంస్థలతో పోలిస్తే జీఏ2 ఫార్ములా డిఫరెంటుగా ఉంది. ఇక ఈ సంస్థ సక్సెస్ వెనక అంత కసరత్తు ఉంది కాబట్టి అవే మంచి లక్షణాల్ని అమల్లో పెడితే కొత్త వాళ్లు అయినా సక్సెసవుతారు. అయితే అభిరుచిని బట్టి కూడా ఫేట్ డిసైడ్ అవుతుంటుంది. జనాల అభిరుచి ఏంటి? నేటి యువతరం ట్రెండ్ ఏంటో పట్టుకోకపోతే ఏం చేసినా కష్టమే.