రకుల్ ఇన్నర్ సొగసు చూడతరమా!
ఈ సందర్భంగా సొంత బ్యానర్ సినిమాకు ప్రచారంలో బిజీగా ఉంది. మరోవైపు రకుల్ బోల్డ్ ఫోటోషూట్లు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.
రకుల్‌ప్రీత్ సింగ్ ఇటీవల భారతీయుడు 2 (ఇండియన్ 2)లో కనిపించింది. ముదస్సర్ అజీజ్ `మేరే హస్బెండ్ కి బివి`లో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్‌లతో కలిసి కనిపించనుంది. వాషు భగ్నాని, జాకీ భగ్నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 21న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా సొంత బ్యానర్ సినిమాకు ప్రచారంలో బిజీగా ఉంది. మరోవైపు రకుల్ బోల్డ్ ఫోటోషూట్లు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. తాజాగా టోన్డ్ దేహశిరులను ఎలివేట్ చేస్తూ రకుల్ రచ్చ రచ్చ చేసింది. మ్యారీడ్ బ్యూటీ రకుల్ ఈ వేషాలేమిటీ? అంటూ ఈ కొత్త లుక్ చూడగానే నెటిజనుల్లో కామెంట్లు వేడెక్కిస్తున్నాయి.
రకుల్ ఎరుపు రంగు బ్రాలెట్.. సింగిల్ చెవికి ఫిట్ చేసిన బిగ్ సైజ్ జూకా..! కూడా తన ఆకర్షణను పదింతలు పెంచాయి. ఈ లుక్ కూడగానే రకుల్ 2.0 లుక్ అంటూ యూత్ ఫిదా అయిపోతున్నారు. ఫ్యాషన్ గేమ్ ని మార్చడంలో రకుల్ సాహసాన్ని అందరూ పొగిడేస్తున్నారు. రకుల్ ప్రతిసారీ తాను ధరించే స్పెషల్ డిజైనర్ లుక్ విషయంలో షో స్టాపర్ గా మారుతోంది.