నాలుగు భాషల్లో సుధీర్ బాబు సినిమా

Update: 2016-10-02 07:39 GMT
ఎప్పటినుండో నానుతున్న సినిమా.. ఈ బయోపిక్. సుధీర్ బాబు హీరోగా ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఇప్పుడు కోచ్.. పుల్లెల గోపిచంద్ జీవిత కథను సినిమాగా ఆవిష్కరించాలని చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాను ఎప్పుడెప్పుడు పట్టాలెక్కిస్తారా అనుకుంటుంటే.. ఇప్పుడు పివి సింధుకు కోచింగ్ ఇచ్చి ఆయన ఆమెతో సిల్వర్ మెడల్ గెలిచేలా చేవారు కాబట్టి.. ఇదే సరైన టైమ్ అని ఫిక్సయ్యారట.

అందుకే ఇప్పుడు గోపిచంద్ జీవిత కథ ఆధారింగా ఆల్రెడీ రూపొందిన స్ర్కిప్టుకు కొన్ని మార్పులూ చేర్పులూ చేస్తున్నారు. అందుకే ముఖ్యంగా కోచ్ బాధ్యతలు నిర్వహిస్తున్న గోపి.. సదరు బ్యాడ్మింటన్ అకాడమీ పెట్టడానికి ఎంతగా శ్రమించాడో చెబుతున్నారు. అయితే ఈ కథకు మాటల వర్షెన్ ను ఏకంగా మూడు బాషల్లో రాస్తున్నారు. తెలుగు అండ్ ఇంగ్లీష్‌ వర్షెన్ తో పాటు ఇప్పుడు హిందీలో కూడా డైలాగులు రాయిస్తున్నారు. ఎందుకంటే బాగీ సినిమా తరువాత హిందీలో సుధీర్ కాస్త పాపులర్ అయ్యాడు. అందుకే హిందీలో కూడా సినిమాను రూపొందించాలని ఫిక్స్ చేశారు. ఇక తమిళంలోకి ఎలాగో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారటలే.

మొత్తానికి ఒక మిల్కా సింగ్.. మేరీ కోం.. ఒక ధోని.. బయోపిక్ తరహాలో ఇప్పుడు గోపిచంద్ సినిమా కూడా భారీ స్థాయిలోనే రూపొందుతుందనమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News