ఏ దర్శకుడినైనా మాస్ డైరెక్టర్ అంటారు.. కాకపోతే క్లాస్ డైరెక్టర్ అంటే.. మన టాలీవుడ్ లో అయితే క్రియేటివ్ డైరెక్టర్ అనే మాట కూడా ఉంది. కానీ ఇంటెలిజెంట్ డైరెక్టర్ అనీ.. బ్రిలియంట్ డైరెక్టర్ అనే మాటలు కూడా పుట్టడానికి కారణం.. సుకుమార్. ఈ దర్శకుడు ఇండస్ట్రీలోకి వచ్చాకే ఈ పద ప్రయోగం మొదలైంది. ఇందుకు కారణం.. తొలి సినిమా నుంచి ప్రతీ ఫ్రేమ్ లోనూ తెలివితేటలను గుప్పించడమే.
ఈ లెక్కల మాస్టారు తెలివితేటలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పడానికి.. నాన్నకు ప్రేమతో మూవీలో 'ఆ చెప్పును 30 డిగ్రీస్ యాంగిల్ లో పక్కకి తిప్పు' అన్న తర్వాత వచ్చే ఫైట్ ఒక్కటి చాలు. ఇలా సినిమాల్లోనే కాదట.. ఈయన ప్రొఫెసర్ గా పాఠాలు చెప్పేటప్పుడు కూడా విభిన్నంగానే ఆలోచించేవాడట. సుకుమార్ లెక్కల మాస్టారే అయినా.. ఇతర మ్యాథ్య్ టీచర్ లాగా ఎప్పుడూ ఏ స్టూడెంట్ ని కొట్టలేదట. కనీసం శిక్షించేవాడు కూడా కాదట. ఎవరినైనా పనిష్ చేయాలంటే.. ఆ కుర్రాడికి వేయాల్సిన ఇంపోజిషన్ ను తనే రాసి తెల్లారి క్లాసుకు పట్టుకొచ్చేవాడట సుక్కు.
స్టూడెంట్స్ ను కొట్టేందుకు బదులుగా బెత్తంతో ఆ శిక్ష తనకే వేసుకునేవాడట. పైగా టాపర్స్ ని కాకుండా వెనకబడ్డవాళ్లపైనే ఎక్కువ కాన్సంట్రేట్ చేసేవాడట ఈ మాస్టారు. లెక్కలు చెప్పడంలో కూడా ఇంత పక్కాగా లెక్కలు ఫాలో అయిపోయాడు కాబట్టే.. ఇప్పుడు బ్రిలియంట్ డైరెక్టర్ అయిపోయాడు. ఇలాంటి లెక్కల మాస్టారు చిన్నప్పడు మనక్కూడా ఉంటే బాగుండేది కదూ అనిపిస్తోందా!