మ్యూజిక్.. ఓకే.. డిస్కో ఓకే... మూవ్ ఇట్ ఒకే.. అంటూ భలే ఫన్నీగా ఓ పాట ఉంటుంది ‘కుమారి 21 ఎఫ్’ సినిమాలో. ఈ పాట రెఫరెన్సుతో తన ఆస్థాన సంగీత దర్శకుడు దేవివ్రీ ప్రసాద్ మీద ప్రశంసలు జల్లు కురిపించాడు సుకుమార్. తన దర్శకత్వంలో దేవిశ్రీని హీరోగా పరిచయం చేయబోతున్నట్లు నిన్న ‘కుమారి 21 ఎఫ్’ సక్సెస్ మీట్ లో ప్రకటించిన సుకుమార్... దేవిశ్రీ హీరో ఏంటి అని అడిగేవాళ్లకు అక్కడే సమాధానం కూడా చెప్పేశాడు.
‘‘దేవిశ్రీ ఎనర్జీ ఇంకెవరికీ సాధ్యం కాదు. ఇండియాలో దేవి లాగే స్టేజ్ ఎక్కి మ్యూజిక్ షోలు చేయగలిగేవాళ్లు ఎవ్వరూ లేరు. దేవిశ్రీ డ్యాన్సులు ఇరగదీస్తాడు.. ఓకే. ఎనర్జీ.. ఓకే. యాక్టింగ్.. ఓకే. నటన కూడా ఓకే. ఇంకా ఏదైనా సరే చేయగలడు. ఇన్ని ఉన్నవాడిని పెట్టుకుని సినిమా చేయడానికి నాకేంటి ఇబ్బంది. అతను ఏ విషయంలోనూ తక్కువ కాదు. అందుకే సినిమా చేయబోతున్నా’’ అని సుకుమార్ చెప్పాడు.
ఇక దిల్ రాజు మాట్లాడుతూ.. దేవిశ్రీ ఒక రాక్ స్టార్ అని.. అతడికి హీరోల స్థాయిలో ఫాలోయింగ్ ఉందని.. స్టేజ్ ఎక్కాడంటే ఒక ఊపు ఊపేస్తాడని.. దేవిశ్రీ కనిపించాడంటే జనాలు ఊగిపోతారని అన్నాడు. దేవిశ్రీని తాను హీరోగా పరిచయం చేయడం అతడి అదృష్టం కాదని.. అతడికి ఆ టాలెంట్ ఉందని అన్నాడు దిల్ రాజు.