సినిమాల పై భానుడి రివెంజ్?

Update: 2016-04-18 09:30 GMT
ఎండాకాలం అంటే పిల్లలకు సరదా, ఎంచక్కా వేసవి సెలవులతో పుస్తకాలకు టాటా చెప్పి, ఆటాపాట వైపు అడుగులేయచ్చని, అయితే ఇదేకాలం శ్రమజీవులకు మాత్రం అత్యంత కష్టతరం. స్వేదరంద్రాలనుండి ధారాపాతంగా కారుతున్న చమట చుక్కలే వాళ్ళ కష్టానికి నిదర్శనం. అలాగని ఆ రోజుకు పని మానేయలేని బ్రతుకులు ఎన్నో.. చూడడానికి రిచ్ గా కనిపించినా పాపం మన పూర్ సినిమా ఇండస్ట్రీకి ఈ వేసవి ఎఫెక్ట్ ఎక్కువే తగులుతుంది.

షూటింగ్ ఎక్కువగా జరుపుకునే హైదరాబాద్ వంటి ప్రాంతాలలో భానుడి ప్రతాపం చూపిస్తుంటే ఆ మండుటెండలో షూటింగ్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. సినిమా అంటే ఒకరి కష్టం కాదుగాబట్టి ఇక్కడ ప్రతీఒక్కరి అవసరం చాలా అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే బాహుబలి షూటింగ్ కి ఒక నెల సెలవు ప్రకటించిన సంగతి తెలిసినదే. తారక్ కూడా తన జనతా గేరేజ్ షూటింగ్ పిక్ ని అప్ లోడ్ చేసి టెక్నీషియన్ల కష్టాన్ని మెచ్చుకున్నాడు. పెద్ద సినిమాల పరిస్థితే ఇలా వుంటే ఇక చిన్న చిత్రాల మాట చెప్పనవసరం లేదు.

ఈ వేసవిని నిరోధించలేం గానీ పీక్ సమ్మర్ లో ఇండోర్ సీన్స్ షెడ్యూల్ ప్లాన్ చెయ్యడం, స్క్రిప్ట్ లో ఎక్కడైనా ఫారెన్ లోకేషన్లకు ఛాన్స్ వుంటే అవి ఈ సీజన్ లో పెట్టుకోవడం వంటి ప్రత్యుమ్న్యాలతో భానుడి రివెంజ్ ని ఒకింత అరికట్టచ్చు.    
Tags:    

Similar News