సీనియర్ స్టార్ హీరోలందరితో కూడా స్టెప్పులు వేయించిన ది గ్రేట్ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ కు అప్పట్లో నటుడిగా కూడా ఆఫర్లు వచ్చాయట. కాని నటనలో పెద్దగా ప్రావిణ్యం లేకపోవడం వల్ల వచ్చిన అవకాశం చేజారి పోయిందట. తాజాగా ఒక టాక్ షో లో పాల్గొన్న సుందరం మాస్టర్ పలు ఆసక్తికర విషయాల గురించి మాట్లాడాడు.
తమిళంలో ఒక స్టార్ హీరో మూవీలో కీలక పాత్రలో నటించేందుకు అవకాశం వచ్చింది. ఒక చిన్న షాట్ ను నా పై చిత్రీకరించేందుకు రెడీ చేశారు. దర్శకుడు ఆ డైలాగ్ ను నాతో చెప్పించుందుకు 13 టేక్స్ కష్టపడ్డాడు. అప్పటికి కూడా నేను సరైన డైలాగ్ డెలవరీతో నటించక పోవడంతో దర్శకుడు కోపంతో నా స్థానంలో మరొకరిని తీసుకున్నాడు. అప్పటి నుండి కూడా మళ్లీ నటన వైపు చూడలేదని, నటన అంటేనే తనకు భయం అంటూ సుందరం మాస్టర్ చెప్పుకొచ్చాడు. కొరియోగ్రాఫర్ గా సక్సెస్ లు దక్కించుకున్న నన్ను కొందరు నటించమని బలవంతం చేశారు. కాని నేను మాత్రం వారికి దండం పెట్టి ఊరుకున్నాను.
ఒక వేళ నేను ఆరోజు సరిగ్గా నటించి ఉంటే మంచి నటుడిని అయ్యే వాడిని. ప్రస్తుతం ఉన్న ప్రకాష్ రాజ్ స్థానంలో నేను ఉండే వాడిని అంటూ మాస్టర్ అన్నాడు. ప్రకాష్ రాజ్ లా తాను కూడా స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టును అయ్యేవాడిని అంటూ సుందరం మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఒక వేళ తాను క్యారెక్టర్ ఆర్టిస్టును అయితే ప్రకాష్ రాజ్ కు ఆస్థాయి వచ్చేది కాదు అనేది ఆయన అభిప్రాయం. సుందరం మాస్టర్ నటుడిగా రాణించలేక పోయినా కోరియోగ్రఫర్ గా ఎన్నో సూపర్ సూపర్ హిట్స్ ను అందుకున్న విషయం తెల్సిందే.