రాఘవేంద్రరావు .. తెలుగు తెరపై రొమాన్స్ కి అందమైన అర్థం చెప్పిన దర్శకుడు. కమర్షియల్ సినిమా అంటే ఏమిటి అనే సందేహానికి సరైన అర్థం చెప్పిన దర్శకుడు. తన కెరియర్లో ఆయన ఎన్నో భారీ విజయాలను అందుకున్నారు. ప్రేక్షకుల నుంచి అభిమానమనే బహుమానాన్ని అందుకున్నారు. అలాంటి రాఘవేంద్రరావు ఒక్కసారిగా భక్తి చిత్రాలపై దృష్టి పెట్టడంతో అంతా ఆశ్చర్యపోయారు. అప్పటివరకూ ఆయన చేసిన సినిమాలకి .. భక్తి చిత్రాలకి ఎలా పొంతన కుదురుతుందని గుసగుసలాడుకున్నారు. అలాంటివారి సందేహాలకు తెరదించేయడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు.
శ్రీరామదాసు ... అన్నమయ్య .. శ్రీమంజునాథ వంటి సినిమాలు ఒకదానికి మించి మరొకటి విజయాలను అందుకున్నాయి. భక్తి చిత్రాలపై కూడా ఆయన తనదైన ముద్ర వేయడం విశేషం. ఆ తరువాత ఆయన నుంచి వచ్చిన 'షిరిడి సాయి' .. 'పాండురంగడు' వంటి సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. ముఖ్యంగా 'పాండురంగ మహాత్మ్యం' సినిమాలోని 'అమ్మా అని పిలిచినా' అనే పాటను కొత్తదనం పేరుతో టచ్ చేయడం దెబ్బకొట్టేసింది. అలా రాఘవేంద్రరావు - బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన 'పాండురంగడు' ప్రేక్షకులకు ఒకరకమైన అసంతృప్తిని మిగిల్చింది.
మళ్లీ ఇంతకాలానికి ఈ ఇద్దరూ కలిసి మరో భక్తి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టారని సమాచారం .. ఆ సినిమా పేరే 'రామానుజాచార్య'. భారతదేశంలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లిన మహానుభావులుగా ఆది శంకరాచార్య .. రామానుజాచార్య. ఆధ్యాత్మికత పరంగా వారి సిద్ధాంతాలు వేరైనా భక్తి ఉద్యమంలోనే వారి ప్రయాణం సాగింది. 'ఆది శంకరాచార్య'పై తెలుగులో ఇంతకుముందు సినిమాలు వచ్చాయి. రామానుజాచార్యులవారి జీవితాన్ని మాత్రం ఈ స్థాయిలో టచ్ చేసిన వారు లేరు. ఇప్పుడు బాలయ్య - రాఘవేంద్రరావు అదే పనిలో ఉన్నారు.
ఈ సినిమాకి కథాకథనాలను భారవి సమకూర్చుతున్నట్టుగా తెలుస్తోంది. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు మొదలవుతున్నాయి. బాలయ్య క్రేజ్ కీ .. ఇంతవరకూ ఆయన చేస్తూ వచ్చిన సినిమాలకి ఈ కథ పూర్తి భిన్నమైనది. 'శ్రీరామదాసు' .. 'అన్నమయ్య' సినిమాల కంటే కూడా భిన్నమైన కథ .. అంతకంటే స్లోగా సాగే ఇది. తిరు మంత్రాన్ని ఈ లోకానికి ఉపదేశించిన రామానుజులవారి పాత్రలో మెప్పించడం సాహసమేనని చెప్పాలి. అలాంటి సాహసానికి బాలయ్య పూనుకోవడం నిజంగా విశేషమే. చాలా గ్యాప్ తరువాత రాఘవేంద్రరావు చేస్తున్న ఈ సినిమా,ఏ స్థాయి విశేషాలను మూటగడుతుందో చూడాలి.