లేడీ సూపర్‌ స్టార్‌ మూవీలో సూపర్‌ స్టార్‌ విలన్‌!!

Update: 2021-06-23 06:30 GMT
సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార కరోనా సమయంలో కూడా జోరు తగ్గలేదు. ఇప్పటికే ముక్కుత్తు అమ్మన్‌ సినిమా ను డైరెక్టర్ ఓటీటీ ద్వారా విడుదల చేసిన నయతార ప్రస్తుతం నేత్రికన్‌ సినిమా తో విడుదలకు సిద్దంగా ఉంది. థియేటర్లు లేదా ఓటీటీ ఏదో ఒక మార్గంలో అతి త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఇక ఈమె రజినీకాంత్‌ తో నటించిన అన్నాత్తే సినిమా షూటింగ్‌ ముగించుకుని విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు ప్రియుడి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోంది. విజయ్‌ సేతుపతి మరియు సమంతలు కూడా ఆ సినిమాలో కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ఇక మరో సినిమా గురించి ప్రస్తుతం ఇంట్రెస్టింగ్‌ పుకారు ఇండస్ట్రీ వర్గాల్లో షికార్లు చేస్తోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ వారు నయనతారతో వరుస చిత్రాలకు ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో మొదటి సినిమా పాన్ ఇండియా సినిమా గా భారీ బడ్జెట్‌ తో రూపొందబోతుందట. ఆ సినిమా లో నయనతార పవర్‌ ఫుల్‌ రోల్‌ లో కనిపించబోతుందని.. అదే సినిమా లో కన్నడ సూపర్‌ స్టార్‌ సుదీప్‌ విలన్‌ గా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికి తెలుగు మార్కెట్‌ లో కూడా మంచి పేరు ఉంది. కనుక తమిళం.. కన్నడంతో పాటు టాలీవుడ్ లో కూడా ఈ కాంబో మూవీ కి మంచి బజ్ ఉండే అవకాశం ఉంది. కనుక ఖచ్చితంగా ఈ సినిమా నయన్‌ స్టార్‌ డమ్ ను మరింతగా పెంచుతుందని అంతా నమ్మకంగా ఉన్నారు.

లేడీ సూపర్‌ స్టార్‌ మూవీలో కన్నడ సూపర్‌ స్టార్‌ సుదీప్‌ నటించబోతున్నాడనే వార్తలు ప్రస్తుతం తమిళ మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. డ్రీమ్‌ వారియర్ వారు సుదీప్‌ ను సంప్రదించగా నయన్‌ మూవీలో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చాడు. సుదీప్‌ గతంలో విలన్ గా నటించాడు. కనుక నయన్‌ మూవీలో ఆయన నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన ఒకటి రెండు వారాల్లో వచ్చే అవకాశం ఉంది. డ్రీమ్‌ వారియర్ వారు ఈ ప్రాజెక్ట్‌ కు సంబంధించి భారీగా ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News