నేను శృంగారం చేసినా నా భర్త ఏమి అనడు!!

Update: 2020-05-22 08:30 GMT
తెలుగులో శర్వానంద్ కి జోడీగా రాజు మహారాజు అనే సినిమాలో ఆడిపాడిన భామ సుర్వీన్ చావ్లా. ఆ సినిమా ప్లాప్ తో తెలుగులో మళ్లీ కనిపించలేదు. సాధారణంగా సంచలన కామెంట్స్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇండస్ట్రీలో పెళ్లి అయిన తర్వాత నటన కొనసాగించడం కాస్త కష్టమే. కానీ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో సమంత - శ్రీయ లాంటి ఒకరిద్దరు హీరోయిన్లు మాత్రమే పెళ్లి తర్వాత యాక్టింగ్ కొనసాగిస్తున్నారు. కానీ బాలీవుడ్‌‌ లో మాత్రం అలా ఉండదు. అక్కడ పెళ్లికి - నటనకు అస్సలు సంబంధం ఉండదు. నటన - వివాహం అస్సలు సంబంధం లేని అంశాలు అంటారు బాలీవుడ్ వయ్యారి భామలు. సినిమాలో ఎలా నటించినా అంతా నటనలో భాగమే అనుకుంటారు తప్ప నిజమనే ఫీలింగ్ ఎవరికీ ఉండదు. అందుకే రాధికా ఆప్టే - సన్నీ లియోన్ - ప్రియాంకా చోప్రా - కల్కీ కొచ్చిన్ ఇలా ఈ వరుసలో చాలా మంది భామలు ఉన్నారు.

ఈ భామలు శృంగార సన్నివేశాలని కూడా చాలా ఈజీగా చేసేస్తారు. అయితే వారు అలాంటి సన్నివేశాలను అంత సులభంగా చేస్తున్నారంటే అందులో భర్త ప్రోత్సాహమే కారణం అని చెప్పాలి. అలా సుర్వీన్.. హేట్ స్టొరీ 2 సినిమాలో రెచ్చిపోయి బాలీవుడ్ లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అందులో సుర్లీన్ చావ్లా చేసిన శృంగార సన్నివేశాలు - అందాల ప్రదర్శనతో ఈ అమ్మడి పై బాలీవుడ్ దృష్టి పెట్టింది. ఎన్ని అవకాశాలు వచ్చినా.. అమ్మడు చేస్తున్న సినిమాలలో ఎక్కువగా గ్లామర్ పాత్రలే కావడం విశేషం. ఇక ఐదేళ్ళ క్రితమే పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు పెళ్లి తరువాత మరిన్ని శృంగార భరిత సినిమాలు చేసింది. ఈ విషయం పై ఆమె ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను నగ్నంగా నటించినా తన భర్త ఎలాంటి అభ్యంతరం చెప్పరని - అదంతా నటనలో భాగంగా చూస్తారని చెప్పింది. అందుకే నేను ఎలాంటి పాత్రలు చేయడానికి అయిన సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చింది సుందరి.
Tags:    

Similar News