ల‌వ్ బ్రేక‌ప్: సారా అలీఖాన్ నుంచి సుశాంత్ ని విడ‌దీసారు!

Update: 2020-09-17 12:30 GMT
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (SSR ) మరణం తరువాత సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ చెప్పిన ఓ విష‌యం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. సారా అలీ ఖాన్ సుశాంత్ సింగ్ ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్న రోజులను తాను మ‌రిచిపోలేన‌ని.. సారా డెబ్యూ మూవీ `కేదార్ ‌నాథ్`  ప్రమోషన్ సమయంలో దాదాపు విడదీయలేనంత స‌న్నిహితులైపోయార‌ని ఆ రోజులను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని రాశారు శామ్యూల్.

సారా SSR నుంచి విడిపోవడానికి కారణం ఏమిటో అప్పుడే అర్థ‌మైంది. శామ్యూల్ పోస్ట్ తరువాత కంగనా క‌రీనాపై ఫిరంగులు విస‌ర‌డం మొద‌లు పెట్టింది. `ఫాన్సీ నెపోటిజం కిడ్` అంటూ సారాని తిట్టేయ‌డ‌మే గాక‌.. `హాని కలిగించే బయటి వ్యక్తి`కి ఎందుకని సారా క‌ల‌లు చూపించింద‌ని ప్రశ్నించారు. ``ఎస్.‌ఎస్.‌ఆర్ - సారా వ్యవహారం మీడియా అంతటా తెలుసు. స్పష్టంగా వారు అంత‌కుముందు ఔట్ డోర్ షూట్ లో ఒక గదిని పంచుకుంటున్నారు. ఈ ఫాన్సీ నేపాటిజం పిల్లలు బలహీనమైన బయటివారికి కలలను ఎందుకని ఇలా నాశ‌నం చేస్తారు. క‌ల‌ల్లో దించి తరువాత బహిరంగంగా వాటిని డంప్ చేస్తారు?`` అని వ్యాఖ్యానించింది క్వీన్.

2020 జూన్ 14 న నటుడు సుశాంత్ మరణించినప్పటి నుండి మూవీ మాఫియా గురించి మాట్లాడుతున్న కంగనా రనౌత్ తాజా ఇంటర్వ్యూలో సుశాంత్ - సారా సంబంధం గురించి మ‌రోమారు మాట్లాడారు.  సారా  సవతి తల్లి కరీనా కపూర్ ఖాన్ ఒకప్పుడు తన మొదటి హీరోతో డేటింగ్ చేయవద్దని సారాకు చెప్పింది. అతను సారాతో డేటింగ్ చేస్తున్నప్పుడు విడిపోవాల‌ని కోరుకుంది. మొదటి హీరోతో డేటింగ్ చేయవద్దని కరీనా కూడా లైవ్ లో అన‌డం తెలిసిందే. కాబట్టి వారు బహిరంగంగా అతనిని క్యారెక్టర్ ని హత్య చేసారు. అతనిని ఎగతాళి చేశారు. సుశాంత్ పూర్తిగా మూలన ప‌డి ఉన్నప్పుడు మరొక సమూహం (మీడియా) రాబందులు వచ్చాయి. వారు చేయాల్సిన‌ది చేశారు`` అంటూ అటు మీడియాని ఇటు క‌రీనాని క్వీన్ తిట్టి పారేసారు. ఇంతకుముందు కంగనా 99శాతం బాలీవుడ్ తారలు మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నారని తెల‌ప‌డం సంచ‌ల‌నమే అయ్యింది.
Tags:    

Similar News