బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి నుండి అభిమానులు మెల్ల మెల్లగా బయటకు వస్తున్నారు. ఆయన జ్ఞాపకార్థం ఆయన మైనపు విగ్రహంను మేడమ్ టూస్సాడ్స్ లో ఏర్పాటు చేయాలంటే ఉద్యమం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 50 వేల మంది సుశాంత్ కు అనుకూలంగా సంతకాలు చేసి మైనపు విగ్రహంను డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే సుశాంత్ విగ్రహంను పశ్చిమ బెంగాల్ లోని అసనోల్ లో ఆవిష్కరించారు. సుశాంత్ విగ్రహంను అభిమానంతో తాము తయారు చేయించినట్లుగా వారు చెబుతున్నారు.
సుశాంత్ విగ్రహం అంటూ మీరు చెబితే కాని మాకు అర్థం కావడం లేదు అంటూ కొందరు మీమ్స్ చేస్తున్నారు. సుశాంత్ విగ్రహం తయారు చేయాలని మీరు అనుకోవడం సంతోషం. కాని హడావుడిగా కాకుండా కాస్త మెల్లగా విగ్రహంను ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ విగ్రహంకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో వారు ఇలా హడావుడిగా విగ్రహం తయారు చేశారేమో అనిపించింది అంటూ నెటిజన్స్ అంటున్నారు. మేడమ్ టుస్సాడ్స్ వారే విగ్రహంను తయారు చేయాలని సుశాంత్ అభిమానులు కోరుకుంటున్నారు. వారు అయితేనే చాలా అందంగా సుశాంత్ రూపంను తీసుకు రాగలని భావిస్తున్నారు. కాని వారు మాత్రం సుశాంత్ విగ్రహం విషయంలో ఆసక్తిగా లేనట్లున్నారు.