సైరా ఎన్ని థియేట‌ర్ల‌లో రిలీజ్?

Update: 2019-10-01 09:02 GMT
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా-న‌ర‌సింహారెడ్డి` తెలుగు- హిందీ- తమిళ- మలయాళ- కన్నడ- హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ‌వుతోంది. ఈ బుధ‌వారం రిలీజ్ సంద‌ర్భంగా అభిమానుల్లో ఉత్కంఠ నెల‌కొంది.  సైరా చిత్రం సాహో రికార్డుల్ని బ్రేక్ చేస్తుందా?  బాహుబ‌లి రికార్డుల‌ను అందుకుంటుందా? అంటూ ఎవ‌రికి వారు ర‌క‌రకాల ఊహాగానాల్లో ఉన్నారు. ఇంత‌కీ సైరా ఎన్ని థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతోంది? అన్న‌దానికి తాజాగా జ‌వాబు దొరికింది.

పాన్ ఇండియా మూవీ సైరా రిలీజ్ ను కొణిదెల కంపెనీ భారీ స్థాయిలోనే ప్లాన్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4620 థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంద‌ని తెలుస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా థియేటర్ల సంఖ్యను ప‌రిశీలిస్తే.. నైజాం 420.. సీడెడ్ 330.. ఆంధ్ర 450 మేర థియేట‌ర్ల‌ను కేటాయించారు. ఓవ‌రాల్ గా ఏపీ తెలంగాణ‌లో 1200 థియేట‌ర్లలో రిలీజ‌వుతోంది. దేశవ్యాప్తంగా ఏ రేంజులో రిలీజ్ చేశారు? అన్న‌ది ప‌రిశీలిస్తే... ఆంధ్రప్రదేశ్ తెలంగాణా కలిపి 1200.. కర్ణాటక 340.. తమిళనాడు 350.. కేరళ 130.. థియేట‌ర్ల‌లో రిలీజువ‌తోంది. ఉత్తరాది స‌హా ఓవర్సీస్ క‌లుపుకుంటే దాదాపు 3600 థియేటర్లలో రిలీజ‌వుతోంది.

హైద‌రాబాద్- చెన్నై-ముంబై- అమెరికా స‌హా ప్ర‌తిచోటా స్పెష‌ల్ షోల‌కు తీవ్ర‌మైన డిమాండ్ నెల‌కొంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 8 ఏఎం 50 స్పెషల్ షోలకు రెడీ చేశారు. ఇది కూడా కేవలం తెలుగు వెర్షన్ వరకే. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇన్ని స్పెషల్ షోలు వేయలేదు. ఇంత‌కుముందు `సాహో`కి కూడా 30 స్పెషల్ షోలు వేశారు.  అయితే ఓవ‌రాల్ గా చూస్తే బాహుబ‌లి- సాహో చిత్రాల్ని దాదాపు 9000 పైగా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. సైరా మాత్రం 5వేల లోపు థియేట‌ర్ల‌లోనే రిలీజ‌వుతోంద‌న్న‌ది రిపోర్ట్. 5 భాష‌ల్లో ట్రైల‌ర్ల‌కు స్పంద‌న బావుంది. కంటెంట్ లో ఎమోష‌న్ ఏ మేర‌కు వ‌ర్క‌వుటైంది అన్న‌దే సైరా ఫేట్ ని నిర్ణ‌యిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. క్రేజుకు త‌గ్గ‌ట్టే అంచ‌నాల్ని చేరువ కావాల్సి ఉంటుంది.
Tags:    

Similar News