రన్నింగ్ షాదీ కోసం పిలువని పెళ్లికి..

Update: 2017-01-18 01:30 GMT
పింక్ మూవీతో బాలీవుడ్ లో యాక్ట్రెస్ గా మంచి పేరు సంపాదించుకున్న తాప్సీ పన్ను.. ఇప్పుడు రన్నింగ్ షాదీ.కాం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం.. ఇప్పుడు అమ్మడు ప్రచార బాధ్యతలు భుజాన వేసుకుని మోసేస్తోంది.

పారిపోయి పెళ్లిళ్లు చేసుకునే జంటలకు హెల్ప్ చేసే కాన్సెప్ట్ పై రూపొందిన ఈ మూవీ పబ్లిసిటీలో భాగంగా.. నిజంగానే ఓ పెళ్లికి వెళ్లిపోయి హంగామా చేసింది ఢిల్లీ బ్యూటీ. ముంబైలోని ఓ హోటల్ లో జరుగుతున్న పెళ్లిలో సడెన్ గా సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యక్షమైంది తాప్సీ పన్ను. దీనికి ముందే ట్విట్టర్ లో ఓ సీక్రెట్ కూడా చెప్పింది. 'మరో రెండు గంటల్లో ఓ పెళ్లి ఫంక్షన్ కు సడెన్ గా వెళ్లబోతున్నా. ఫేస్ బుక్ పేజ్ లో లైవ్ చూడండి. ఇదే నేను చెప్పే సీక్రెట్' అని చెప్పిన తాప్సీ.. చెప్పినట్లుగానే ఓ పెళ్లికి వెళ్లిపోయి అక్కడున్న అందరికీ షాక్ ఇచ్చేసింది.

సడెన్ గా సినిమా హీరోయిన్ పెళ్లిలో కనిపించేసరికి అక్కడున్న అందరూ షాక్ తినేశారు. అయితే.. ఈలోపే మైక్ తీసుకుని తాను వచ్చిన అసలు సంగతి వివరించింది తాప్సీ. అక్కడ ప్లే చేస్తున్న పాటలను ఆపించి.. 'డింపీ పే నాల్ భాగే బంటీ' అంటూ సాగే పాటను ప్లే చేయించింది. ఈ పాటను లాంఛ్ చేయడం కోసం ఇలా కొత్త కాన్సెప్ట్ ను అవలంబించింది రన్నింగ్ షాదీ.కాం యూనిట్. ఏమైనా సినిమా పబ్లిసిటీ కోసం తాప్సీ పన్ను డేర్ ని మాత్రం పొగడాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News