టవల్ లో తాప్సీ.. రీజన్ ఏంటంటే..

Update: 2018-04-02 07:33 GMT
ఢిల్లీ భామ తాప్సీ పన్ను రేంజ్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. సౌత్ లో ఉన్నన్నేళ్లూ బాగా సైలెంట్ గా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టిన తర్వాత.. అదరగొట్టే సక్సెస్ లు అందుకుంటోంది. క్రమంగా తాప్సీ క్రేజ్ బాగా పెరుగుతుండడం.. నార్త్ నుంచి సౌత్ ఉన్న వరకూ డిమాండ్ ఉన్న భామ కావడంతో.. ఈ బ్యూటీతో బ్రాండ్ అండార్స్ మెంట్స్ చేసుకునేందుకు కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి.

ఇప్పుడు ఓ కన్జూమర్ గూడ్స్ కంపెనీ తాప్సీతో బ్రాండ్ అండార్స్ మెంట్ చేసుకుంది. బాడీ లోషన్ క్రీమ్ కు సంబంధించిన ఉత్పత్తులకు ఢిల్లీ భామ ప్రచారం చేయనుంది. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో ఈ బ్రాండ్ కు మంచి గుర్తింపే ఉండగా.. తను ఇన్నేళ్లుగా ఉపయోగించే వస్తువుకే ప్రచారం చేసే అవకాశం రావడం తన అదృష్టంగా చెబుతోంది తాప్సీ పన్ను. ఆ కంపెనీ ఉత్పత్తుల నాణ్యత.. మన్నిక అంటూ బాగానే డైలాగ్స్ చెబుతోంది కానీ.. ప్రచారం దగ్గరకు వచ్చేసరికి మళ్లీ గ్లామర్ యాంగిల్ తప్పదు కదా.

అందుకే ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చిన విధంగా.. ఒంటికి ఓ టవల్ మాత్రం చుట్టుకున్న ఒక ఫోటోలో దర్శనం ఇస్తోంది తాప్సీ పన్ను. నీలం రంగు టవల్ లో అమ్మడి అందాలు బాగానే మెరుస్తున్నాయి. ఇక ప్రచారం చేసిన కంపెనీకి సేల్స్ కూడా మెరిస్తే.. ఇక్కడ కూడా సత్తా చాటేయచ్చు.
Tags:    

Similar News