డేట్ల తేడాతో క్వీన్ పట్టాలు తప్పింది

Update: 2018-02-02 05:00 GMT
ఒక సినిమా ఒకేసారి నాలుగు దక్షిణాది భాషల్లోనూ షూటింగ్ జరుపుకోవడం అన్నది అత్యంత అరుదు. బాలీవుడ్ క్వీన్ సినిమా రీమేక్ కు ఆ క్రెడిట్ దక్కింది. తెలుగు - తమిళం - కన్నడం - మళయాళ భాషల్లో వేరువేరు హీరోయిన్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మిగిలిన భాషల్లో క్వీన్ల పని చకచకా పూర్తయిపోతుండగా తెలుగు క్వీన్ మాత్రం వెనుకబడిపోయింది.

క్వీన్ తెలుగు వెర్షన్ లో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మిస్సమ్మ ఫేం నీలకంఠ తెలుగుతో పాటు మళయాళ వెర్షన్లను డైరెక్ట్ చేస్తున్నాడు. అతడికి.. హీరోయిన్ తమన్నాకు మధ్య బేధాభిప్రాయాలు రావడంతో సినిమా షూటింగ్ ఆగింది. దాంతో కన్నడ - తమిళ వెర్షన్లను డైరెక్ట్ చేస్తున్న రమేష్ అరవింద్ తెలుగు వెర్షన్ డైరెక్షన్ కూడా తలకెత్తుకున్నాడు. ఇదే టైమింగ్ దెబ్బతినడంతో తమన్నా వేరే సినిమాల షూటింగ్ లో బిజీ అయిపోయింది. ఇప్పుడు రమేష్ అరవింద్ తమిళ - కన్నడ వెర్షన్ల పని పూర్తి చేసి తెలుగు సంగతి చూద్దామంటే తమన్నా డేట్లు ఓ పట్టాన అడ్జస్ట్ అవడం లేదని తెలుస్తోంది. ఇన్ని తలనొప్పుల మధ్య మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు షూటింగ్ బాగా స్లో అయిపోయిందని ఈ మూవీ యూనిట్ సభ్యులు అంటున్నారు.

ముందు నాలుగు భాషల్లోనూ ఒకేసారి క్వీన్ సినిమా రీమేక్ విడుదల చేద్దామని ఫిలిం మేకర్లు అనుకున్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యపడేలా లేదనే అనిపిస్తోంది. రమేష్ అరవింద్ మిగిలిన రెండు వెర్షన్ల పనులు కొంతయినా పూర్తి చేసుకుని తెలుగు వెర్షన్ పై దృష్టి పెట్టే టైంకు డేట్లు అడ్జస్టు చేయడానికి తమన్నా కూడా ఓకే చెప్పిందనేది లేటెస్ట్ న్యూస్.  


Tags:    

Similar News