బోల్డ్ మీటర్ లో తమిళ డబ్బింగ్ సినిమా రెడీ!

Update: 2019-03-18 05:19 GMT
ఈమధ్య మన సినిమాలలో బోల్డ్ నెస్..బూతు ఎక్కువయిందని రోతగా ఉందని చాలామంది విమర్శలు చేస్తున్నారు.  అది నిజమే.. బూతు ఎక్కువయింది.. వల్గారిటీ ఎక్కువయింది. కొందరు ఫిలిం మేకర్స్ డబ్బో కోసమో.. సక్సెస్ కోసమో షార్ట్ రూట్ ఎంచుకుంటున్నారు. అలా అని వారు తీసిన రోత సినిమాలన్నీ హిట్ అవుతాయని గ్యారెంటీ లేదు.  విమర్శకుల చేత ఆహా.. ఓహో అనిపించుకున్న 'మనమంతా' లాంటి సినిమా అయినా..విమర్శకుల చేత తిట్టించుకున్న '24 కిస్సెస్' లాంటి  సినిమా అయినా జనాలకు నచ్చితేనే హిట్టు.. లేకపోతే ఫట్టు.  యాజ్ సింపుల్ యాజ్ దట్.

ఇప్పుడు ఈ బోల్డ్.. బూతు టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. తెలుగులోకి మరో బోల్డ్ సినిమా రాబోతోంది. ఇది స్ట్రెయిట్ సినిమా కాదు..  తమిళంలో రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన 'ఇస్పేడ్ రాజావుమ్ ఇదయ రాణియుం' చిత్రానికి డబ్బింగ్ వెర్షన్.  ఈ సినిమాలో యూత్ ను మెప్పించే అవకాశం ఉన్న బోల్డ్ కంటెంట్ బోల్డు ఉంది.  తమిళ చిత్రంపై విమర్శకులు ఈ సినిమాపై పెదవి విరిచారు కానీ యువత మాత్రం మూవీని చూసేందుకు చా..లా.. ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకే నిర్మాతలు ఈ సినిమాను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరో హరీష్ కళ్యాణ్.  పోయినేడాది హరీష్ 'ప్యార్ ప్రేమ కాదల్' అనే హిట్ సినిమాతో తమిళ ప్రేక్షకులను మెప్పించాడు.  ఇప్పుడు నాని 'జెర్సీ' లో కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు.  ఇక 'ఇస్పేడ్ రాజావుమ్ ఇదయ రాణియుం' హీరోయిన్ శిల్పా మంజునాథ్.  సినిమాలో తన బోల్డ్ యాక్టింగ్ తో చంపేసిందట. ఈ సినిమాను ఏప్రిల్ 25 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.  బోల్డ్ సినిమాలను చూసే గట్స్ ఉంటే చూసేయండి.  లేకపోతే ఈ సమాజం ఇలా ఉండడానికి కారణం.. అందరికీ బీపీలు షుగర్లు రావడానికి  ఇలాంటి సినిమాలే కారణం అంటూ మనసులోని తాపం చల్లారేదాక తిట్టండి.
    

Tags:    

Similar News