రజనీకాంత్ .. కమలహాసన్ మొదలు తమిళ హీరోలంతా కూడా తమిళంతో పాటు తెలుగులోను తమ సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ తమ క్రేజ్ ను .. మార్కెట్ ను పెంచుకుంటున్నారు. తెలుగు వెర్షన్ కి సంబంధించి తమ సినిమాల టీజర్లు .. ట్రైలర్లు వదిలే కార్యక్రమాలను కూడా హైదరాబాద్ లో చేసేస్తున్నారు. అంతేకాదు పనిలో పనిగా .. నేరుగా తెలుగు సినిమాలు చేయాలని ఉందనే తమ ఉద్దేశాన్ని బయటపెట్టేస్తున్నారు. అప్పుడు వాళ్లు చేసే తెలుగు సినిమాలు తమిళంలో రిలీజ్ అవుతాయన్న మాట.
కార్తి చేసిన 'ఊపిరి' సినిమా అలాంటిదే. ఇక అప్పటి నుంచి సూర్య కూడా అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా గట్టిగానే చేస్తున్నాడు. ఇక ఇలాంటి ఆలోచన ఉన్న హీరోల్లో తరువాత స్థానంలో విశాల్ కనిపిస్తాడు. ఈ మధ్య తమిళంలో వరుస విజయాలను అందుకున్న విశాల్, స్ట్రైట్ తెలుగు సినిమాలో చేయాలనే ఉద్దేశంతో సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ లోగానే ధనుశ్ ఆ ఛాన్స్ కొట్టేశాడు. అంతేకాదు మరో అడుగు ముందుకు వేసి, ఆ సినిమా హిందీలో కూడా విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు.
తమిళంలో వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను చేయడంలో ధనుశ్ ముందుంటాడు. ఈ మధ్య చేసిన విభిన్నమైన ప్రయోగాలు విజయాలను అందుకున్నాయి. నటుడిగా ధనుశ్ కి ప్రశంసలను తెచ్చిపెట్టాయి. 'అసురన్' .. 'కర్ణన్' వంటి విజయాల తరువాత ఆయన తెలుగులో నేరుగా ఒక సినిమా చేయడం .. అదీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కావడం విశేషాన్ని సంతరించుకుంది. ఇప్పుడు అందరూ ఈ ప్రాజెక్టును గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందా అని ఆత్రుతగా ఎదుచూస్తున్నారు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ కూడా దిల్ రాజు నిర్మాణంలో స్ట్రైట్ తెలుగు సినిమా చేయనున్నాడనేది కొసమెరుపు.