పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీరు భలే చిత్రంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆయన స్పందించే తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా సాహిత్యం పట్ల పవన్ చూపించే శ్రద్ధ.. రచయితల మీద ఆయన చూపించే గౌరవం ఊహించని విధంగా ఉంటుంది. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘ఆధునిక మహాభారతం’ పుస్తకం చదివి పవన్ విపరీతంగా ప్రభావితమై.. దాన్ని పునర్ముద్రణకు పూనుకోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. తాను శివతత్వం మీద రాసిరాసి.. పాడిన గీతాల సీడీని విన్నపుడు కూడా పవన్ ఇలాగే ఉద్వేగానికి గురైనట్లు సీనియర్ నటుడు.. రచయిత తనికెళ్ల భరణి వెల్లడించాడు.
బాలు సినిమా షూటింగ్ టైంలో తాను రాసిన ‘నాలోన శివుడు కలడు’ పద్యాల సీడీని భరణి పవన్ కు ఇచ్చాడట. ఐతే అది విని తీవ్ర భావోద్వేగానికి గురైన పవన్.. మరుసటి రోజు షూటింగుకే రాలేని పరిస్థితికి చేరుకున్నాడట. తాను అంత పెద్ద భక్తుణ్ని కాకపోయినా.. ఈ సీడీ విన్న తర్వాత తనలో ఆధ్యాత్మిక భావాలు నిండిపోయాయని.. ఉదయం లేచి షూటింగుకి కూడా రావాలనిపించలేదని పవన్ చెప్పాడని.. ఐతే తన వల్ల చాలామంది ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో షూటింగుకి పవన్ వచ్చాడని.. భవిష్యత్తులో శివ భక్తుడి పాత్ర పోషించాలనుకుంటున్నట్లు కూడా పవన్ చెప్పాడని తనికెళ్ల భరణి వెల్లడించాడు. కొన్నాళ్ల తర్వాత భరణి భక్తకన్నప్ప స్క్రిప్టును పవన్ కు వినిపించగా.. ఇది భారీగా చేయాల్సిన సినిమా అని.. ప్రస్తుతం తాను ఫ్లాపుల్లో ఉన్న నేపథ్యంలో తర్వాత చేద్దామని పవన్ చెప్పాడట. ఐతే ఆ తర్వాత పవన్ బిజీ అయిపోవడంతో ఆ కథను మంచు విష్ణుకు ఇచ్చినట్లు భరణి వెల్లడించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/