వర్థమాన నటుడు తనీష్ తండ్రి వర్థన్ మరణంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం రాత్రి మణికొండలోని వెస్ట్రన్ ప్లాజాలో ఆయన మరణించటం తెలిసిందే. ఆరో అంతస్తు నుంచి జారిపడినట్లుగా చెబుతున్నప్పటికీ.. అలాంటి అవకాశాలు తక్కువగా ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇందుకు పలు అంశాల్ని వారు చూపిస్తున్నారు.
ఫ్లోర్ రెయిలింగ్ మూడు అడుగుల ఎత్తులోనే ఉన్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు జారి పడితే దెబ్బలు తగిలే అవకాశమే తప్పించి.. తీవ్రంగా గాయాలపాలు కావటం ఉండదన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. వర్ధన్ కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. ఈ కారణంతోనే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మధ్యన పలు ఆస్తుల్ని అమ్మి అప్పుల్ని తీర్చినట్లుగా చెబుతున్నారు. పొరపాటున జారిపడే అవకాశం లేకున్నా..ఆయన మరణించిన నేపథ్యంలో వర్ధన్ మరణాన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టటం గమనార్హం.