భీమిలి కబడ్డీ జట్టు... ఎస్.ఎం.ఎస్. సినిమాలతో టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు యువ దర్శకుడు తాతినేని సత్య. తాజాగా నారా రోహిత్ - రెజీనా జంటగా నటించిన ‘శంకర’ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా ఈనెల 21న విడుదలవుతోంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘మౌనగురు’ చిత్రానికి ఇది రీమేక్. హిందీలో ‘అఖిరా’ పేరుతో విడుదలై విజయం సాధించింది. సోనాక్షి సిన్హా అందులో లీడ్ రోల్ పోషించగా... ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించాడు. విడుదలైన రెండు భాషల్లోనూ... ఘన విజయం సాధించిన ఈ చిత్రం మూలకథ.. ఇప్పుడు తెలుగులో ‘శంకర’పేరుతో నారా రోహిత్ హీరోగా విడుదల కాబోతుండటంతో.. బాగా క్రేజ్ పెరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ ‘నారా రోహిత్ ఇందులో స్టూడెంట్ గా నటించాడు. పాత్రలన్నీ చాలా నాచురల్ గా వుంటాయి. కాలేజీలో స్టూడెంట్స్ మధ్య ఎలాంటి గొడవలుంటాయో.. వాటినే చాలా నాచురల్ గా చూయించాం. తప్పకుండా స్టూడెంట్స్ కి కనెక్ట్ అవుతుంది. అలానే ద్వితీయార్థంలో ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. ఈ చిత్రానికి మాతృకైన ‘మౌనగురు’లో సెకెండాఫ్ కొంచెం స్లోగా వుంటుంది. అది అక్కడ నెటివిటీకి సరిపోతుంది. కానీ మన నెటివిటీకి తగ్గట్టుగా శంకరలో కొంచెం ఫాస్ట్ గా చూపించాం. ఇందులో నారా రోహిత్... తనకు ఎదురైన సమస్యను ఎదుర్కోవడానికి సొంతంగానే ఇన్వెస్టిగేషన్ చేసి... దోషుల ఆటకట్టిస్తాడు. ప్రతినాయకుని పాత్రలో ‘కబాలి’ జాన్ విజయ్ నటించాడు. రెజీనా పాత్ర కూడా ఇందులో చాలా కీలకంగా వుంటుంది’ అన్నారు.
ఇక తన గురించి చెబుతూ ‘ఈ చిత్రం ఆలస్యం కావడం కొంత నిరాశ పరిచింది. కానీ నిర్మాతలు ఇప్పుడు చాలా కేర్ తీసుకుని... గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా తరువాత నాకు మంచి ఆఫర్స్ వస్తాయి. ఈ గ్యాప్ లో నేను సచిన్ జోషితో మరో సినిమా కూడా చేశా. అది కూడా రిలీజ్ కి సిద్ధంగా వుంది. మా తాత - నాన్న గారు దాదాపు వందకు పైగా సినిమాలు చేశారు. వారి పేరుకు ఎక్కడా మచ్చ తేకుండా... నా సినిమాలు నేను చేస్తూ పోతా. ఇక నుంచి ఇండస్ట్రీలో ర్యాపో పెంచుకుంటా. సరైన పీఆర్ లేకపోవడం వల్లే కొంత వెనకపడ్డాననిపించింది. శంకర తరువాత సినిమాలు తీయడంలో వేగం పెంచుతాననే నమ్మకం నాకుంది. ఈ సినిమా తప్పకుండా నారా రోహిత్ కెరీర్లో ది బెస్ట్ అవుతుందనే కాన్ఫిడెంట్ నాకుంది’ అంటూ ముగించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/