వివాదాలతో అంటకాగడం తేజకు కొత్తేమీ కాదు. అతడి సీనియారిటీని గౌరవించి అతడు ఏం మాట్లాడినా అంతా ఆసక్తిగా వింటారు. అయితే ఒక్కోసారి తేజ మాట్లాడేది చెవులకు ఇంపుగా ఉన్నా, ఆలోచనకు పదును పెట్టేలా అనిపించదు. హోరాహోరీ స్పెషల్ ఇంటర్వ్యూ ల్లో అతడు చేసిన ఓ కామెంట్ ప్రస్తుతం టాలీవుడ్ లో డిష్కసన్ పాయింట్ అయ్యింది.
అసలు లెంగ్త్ అనేది కట్ చేసి మన మేకర్స్ పెద్ద తప్పు చేస్తున్నారు. లెంగ్త్ పిచ్చితో తెలుగు సినిమాని చంపేశారు. రెండు గంటల్లో ఏ ఎమోషన్ ని చూపిస్తారు? అవతార్ 3గంటల 10 నిమిషాలు, లగాన్ 3 గంటల 40 నిమిషాలు.. అయినా ఆదరణ దక్కింది. లెంగ్త్ కి హిట్టుకి ఏ సంబంధం లేదు అంటూ వ్యాఖ్యానించాడు. వ్యాఖ్య వినడానికి ఎంత సింపుల్ గా ఉందో, ఎంత ఇంపుగా ఉందో.. అంత వివాదాస్పదంగానూ ఉంది.
అసలు తెలుగులో 3గంటల సినిమా తీసి తేజ మెప్పించగలడా? ఈ ఛాలెంజ్ ని అతడు స్వీకరిస్తాడా? కథ, కాకరకాయ లేకుండా సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో అంత సమయం వెచ్చించి జనం ఓపిగ్గా థియేటర్ లో కూచోగలరా? ఇవన్నీ ఆలోచించే తేజ మాట్లాడుతున్నారా? కామెంట్ విసిరేయడం కంటే ఆచరణలో నిరూపించి అప్పుడు మాట్లాడాలి అంటూ క్రిటిక్స్ సవాల్ విసురుతున్నారు. తేజగారూ .. మీరు రెడీనా? ప్రూవ్ చెయ్యండి మరి. ఒక లగాన్, ఒక అవతార్ లా ఇంకేదైనా తీసి చూపించండి. మీరు తీయబోయే సైన్స్ ఫిక్షన్ సినిమాని అంత సమయం చూపించి మెప్పు పొందండి మరి. వేచి చూస్తున్నాం.. ఎంతో ఆసక్తిగా...!!