హోరాహోరీ.. ఏదో కొత్త స్టయిలంటున్నాడే..

Update: 2015-09-10 20:19 GMT
వరుస ఫ్లాపుల్లో ఉన్న తేజ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ‘హోరాహోరీ’పై భారీ ఆశలతో ఉన్నాడు. ఈసారి హిట్టు కొట్టి తీరతానంటున్న తేజ.. ‘హోరాహోరీ’కి సంబంధించి ఓ ఆసక్తికర విశేషం గురించి చెప్పాడు. మేకింగ్ విషయంలో ఓ సరికొత్త స్టయిల్ అనుసరించానని.. హాలీవుడ్ లో బర్డ్ మ్యాన్ సినిమాను ఆ స్టయిల్ లోనే తీశారని చెబుతున్నాడు తేజ. ఈ కొత్త స్టయిల్ గురించి అతనేమన్నాడో చూడండి.

‘‘హోరాహోరీ సినిమాను ‘ఫోర్త్ వాల్’ అనే డిఫరెంట్ మేకింగ్ స్టయిల్ లో తీశా. నాలుగు గోడలున్న గదిలో కూర్చుని యూనిట్ సభ్యులం మాట్లాడుతుంటాం. మూడు గోడలు మేమైతే నాలుగో గోడ ప్రేక్షకులన్న మాట. అంటే.. సినిమా మొదలైన ఐదు నిమిషాలకు ప్రేక్షకులు స్క్రీన్ లోకి వెళ్లిపోయినట్లుగా భావిస్తారు. కళ్లముందు జరుగుతున్న నిజంలాగా భావిస్తారు. ఆస్కార్ అవార్డు పొందిన హాలీవుడ్ సినిమా ‘బర్డ్ మ్యాన్’ ఈ స్టయిల్ లోనే రూపొందింది. ఇప్పటి వరకు ఈ స్టయిల్ లో తెలుగులో ఎవరూ సినిమా తీయలేదు. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంది’’ అని తేజ చెప్పాడు.

తన గత సినిమాలతో పోలిస్తే ‘హోరాహోరీ’ చాలా కొత్తగా ఉంటుందన్న తేజ.. ప్రేమలో ఎక్స్ ట్రీమ్ లెవెల్ కి పోతే ఏం జరుగుతుందనేది సరికొత్త పద్ధతిలో డీల్ చేశానని చెప్పాడు. సినిమాలో ఎనభై శాతం వర్షంతో ముడిపడ్డ సన్నివేశాలుంటాయని.. తెలుగులో ఎవ్వరూ ఇలా సినిమా తీసి ఉండరని చెప్పాడు. ఫొటోగ్రఫీ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుందన్నాడు.
Tags:    

Similar News