మండే `మే` ఎండల్లో వరుసగా సినిమాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే. నేడు రిలీజైన మహర్షి మానియాని చెక్ చేసుకుని ఒక్కొక్కరుగా రిలీజ్ లకు రెడీ అవుతుండడం ఆసక్తికరం. పరీక్షలు అయిపోయాక వేసవి సెలవులు కలిసొస్తాయనే ఉద్ధేశంతో చాలా చిన్న సినిమాలు వరుసగా రిలీజైపోతున్నాయి. మంచి రిలీజ్ తేదీ.. థియేటర్ల పరంగా ఫ్లెక్సిబిలిటీ కుదరడంతో ఒక్కొక్కరుగా వేంచేస్తున్నారు. అయితే ఈ నెలలోనూ ఓ రెండు శుక్రవారాలు ఒకేసారి మూడు సినిమాలు రిలీజవ్వడం కాంపిటీషన్ కి దారి తీస్తోంది. తాజా రిలీజెస్ లో కాస్తంత మీడియం బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. ఇక ఈ నెలలో వారం వారం రాబోవు సినిమాల వివరాలు పరిశీలిస్తే.. వీటిలో ఓ మూడు నాలుగు చిత్రాలు కాస్తంత హైప్ ఉన్నవే కనిపిస్తున్నాయి.
మహర్షి వచ్చిన నెక్ట్స్ వారమే `అర్జున్ సురవరం` థియేటర్లలోకి వచ్చేందుకు ప్రిపేరవుతున్నాడు. ట్యాలెంటడ్ నిఖిల్ ఎంతో శ్రమించి కాన్ఫిడెంట్ గా హిట్ కొట్టేందుకు బరిలో దిగుతున్నాడు. రకరకాల సందిగ్ధతల అనంతరం కూల్ గా మంచి రిలీజ్ తేదీని చూసుకుని మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడం పాజిటివ్ సంకేతం అనే చెప్పాలి. ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. మే 17న రిలీజ్ కాబట్టి మునుముందు ప్రచారం పరంగా వేగం పెంచేందుకు నిఖిల్ టీమ్ సిద్ధమవుతోంది. ఆసక్తికరంగా నిఖిల్ సినిమాతో పోటీపడుతూ అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ .. స్వయం వధ అనే చిత్రాలు మే 17న రిలీజవుతున్నాయి. అమెరికా నుంచి వచ్చి మన ఊర మాస్ స్లమ్ లో తంటాలు పడే కుర్రాడిగా శిరీష్ నటిస్తున్నాడు. ఏబీసీడీ టీజర్ ఇప్పటికే రిలీజై ఆకట్టుకుంది. డి.సురేష్ బాబు అంతటి పెద్దన్న ఈ సినిమాని రిలీజ్ చేస్తుండడంతో థియేటర్ల సమస్య లేదు. బిజినెస్ పరంగా హైప్ వచ్చిందని చెబుతున్నారు.
ఈ మూడు సినిమాలు రిలీజైన తర్వాతి వారంలో అంటే మే 24న రాజశేఖర్-ప్రశాంత్ వర్మ కాంబో కాప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ `కల్కి`.. బెల్లంకొండ శ్రీనివాస్- కాజల్ జంటగా తేజ తెరకెక్కించిన `సీత`.. నవతరం హీరోలతో తెరకెక్కిన `ఎవరు తక్కువ కాదు`.. ప్రయోగాత్మక చిత్రం `బుర్రకథ` రిలీజవుతున్నాయి. వీటిలో కల్కి టీజర్ కి చక్కని స్పందన వచ్చింది. కల్కి.. సీత చిత్రాల ట్రైలర్లను మహర్షి థియేటర్లలో రిలీజ్ చేయడం ప్లస్ అనే చెప్పాలి. ఇక వీటి తర్వాత ఒక రోజు గ్యాప్ తో అంటే.. మే 25న నాగకన్య రిలీజవుతోంది. రాయ్ లక్ష్మీ .. కేథరిన్ థ్రెసా తదితరులు నటించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంది. అందాల నాయికలు నాగినులుగా కనిపించడం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఆ తర్వాత వారంలో అంటే మే 31న తమిళ స్టార్ హీరో సూర్య నటించిన క్రేజీ సినిమా `ఎన్ జీకే` (నంద గోపాల కృష్ణ) రిలీజ్ కానుంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ - రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగులో సత్తా చాటే ప్లాన్ తో ఎన్ జీకేని భారీగానే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. అయితే ఎన్జీకేతో పాటు అదే రోజు `విశ్వామిత్ర`.. `ఏదైనా జరగొచ్చు` అనే వేరే రెండు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు పోటీబరిలో దిగుతున్నాయి. నందిత రాజ్ నటించిన `విశ్వామిత్ర` ఆసక్తికర మిస్టరీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కినది. అలాగే నవతరం హీరోలతో తెరకెక్కిన `ఏదైనా జరగొచ్చు` చిత్రం రిలీజ్ బరిలో ఉంది.
వీటితో పాటు ఇంకో డజను సినిమాలు క్యూలో ఉన్నాయి .. కానీ రిలీజ్ తేదీలు కుదరక.. థియేటర్లు సెట్టవ్వక అటూ ఇటూ ఊగిసలాడుతున్నాయని ఓ ప్రముఖ చిన్న చిత్రాల నిర్మాత తెలిపారు. మహర్షి చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి కాబట్టి సోమవారం నాటికి సీన్ ఎలా ఉంటుంది? అన్నది ట్రేడ్ ఆసక్తిగా పరిశీలిస్తోంది. తదుపరి వస్తున్న సినిమాలకు బ్రేకుల్లేకుండా థియేటర్ల సమస్య లేకుండా లైన్ క్లియర్ అవుతుందా.. అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక చిన్న సినిమాలకు టిక్కెట్టు ధర పెంచుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ కోణంలో అయినా జనాల్ని థియేటర్లకు రప్పించాలంటే ఆ మేరకు సరైన ప్రచారం అవసరమన్నది నిర్మాతలు గుర్తెరగాల్సి ఉంటుంది.