ట్రెండీ టాక్: బాలకృష్ణ కోసం ఆలయం?

Update: 2021-03-17 05:30 GMT
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బిబి 3 సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే.  సింహా - లెజెండ్ త‌ర్వాత హ్యాట్రిక్ విజ‌యం అందుకునేందుకు దర్శకుడు బోయపాటి శ్రీ‌ను క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నారు.

నంద‌మూరి బాల‌కృష్ణ ఈ చిత్రంలో రెండు మూడు షేడ్స్ ఉన్న పాత్ర‌ల‌తో అల‌రిస్తార‌న్న టాక్ వినిపిస్తోంది. కోవిడ్ మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ లో వాయిదా ప‌డిన ఈ చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. ఈ హ్యాట్రిక్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ ఏడెకరాలలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో ఆలయ నేపథ్యంలో యూనిట్ సుదీర్ఘమైన కీలకమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తోంది.

తాజా స‌మాచారం మేర‌కు.. రూ .30 లక్షల బడ్జెట్ తో స్టూడియోలో ఆలయ సెట్ ను నిర్మించారని తెలుస్తోంది. ఇందులో షూటింగ్ 4 రోజుల క్రితం ప్రారంభమైంది. ఇది మార్చి 22 వరకు కొన‌సాగుతుంది. కొద్దిరోజుల‌ విరామం తరువాత బిబి 3 యూనిట్ తదుపరి భారీ షెడ్యూల్ కోసం కర్ణాటకలోని బెల్గామ్ కు బ‌య‌ల్దేరి వెళుతుంది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్ర‌ల్లో కనిపించనున్నారు.

మిరియాలా రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. పూర్ణ- ప్రగ్యా జైస్వాల్ ఇందులో క‌థానాయిక‌లు. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రానికి చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ అందించాక థ‌మ‌న్ ఈ మూవీ కోసం అద్భుత‌మైన బాణీల్ని సిద్ధం చేస్తున్నార‌ని స‌మాచారం.
Tags:    

Similar News