పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమాలో శృతిహాసన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తుండగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రెండేళ్ళ రాజకీయ విరామం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా వకీల్ సాబ్ రూపొందుతుంది. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఒక సాంగ్ కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలన్ని కలిపి ఒక నెల వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని సమాచారం. లాక్ డౌన్ తర్వాత బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేద్దామని అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి ఇప్పట్లో బ్రేక్ ఇచ్చేలా లేదని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారట.
ఇదిలా ఉండగా.. చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో ‘వకీల్ సాబ్’ సినిమా గురించి స్పందించాడు. ‘మార్చి 16న ‘వకీల్ సాబ్’ కంపోజింగ్ పూర్తి చేసుకుని మార్చి 17న చెన్నైకి వచ్చాను. రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్‌కల్యాణ్ వెండి తెరపై సందడి చేయనున్న ‘వకీల్ సాబ్’ సినిమా పై అభిమానులలో అంచనాలు భారీ లెవెల్లో ఉన్నాయి. ఆయనకి ఉన్న క్రేజ్ పరంగా.. సంగీతం విషయంలో నాకెంతో బాధ్యత పెరిగింది. ఆయనతో నా ఫస్ట్ సినిమా ఇది. పవన్ కళ్యాణ్ రేంజ్ ఏ మాత్రం తగ్గకుండా సంగీతం అందించడానికి ట్రై చేశాను. మేము ఆశించినట్లే విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ ‘మగువా మగువా’ ప్రేక్షకులను చేరింది. ఇక ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేట్ అయ్యే సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీకు గూస్ బంప్స్ తెస్తాయని తమన్ తెలిపాడు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.