సంక్రాంతి సినిమాల సందడి ఇంకా మొదలవ్వలేదు

Update: 2022-11-27 11:30 GMT
కాస్త అటు ఇటుగా సంక్రాంతి సినిమాలు రావడానికి నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. తెలుగు ప్రేక్షకుల ముందుకు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఒకటి లేదా రెండు రోజుల తేడాతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు దిల్ రాజు నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం వారసుడు కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఈ మూడు సినిమాలకు కచ్చితంగా మంచి కలెక్షన్స్ నమోదు అవుతాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ మూడు సినిమాల గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.

ఈ మూడు సినిమాలు ఇప్పటికే జనాల్లో బజ్ క్రియేట్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు క్రియేట్ చేయడంలో మూడు సినిమాలు విఫలం అయ్యాయి అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న టాలీవుడ్ సినిమాల్లో ఎక్కువ శాతం విడుదలకు ముందు మంచి బజ్‌ క్రియేట్ చేసిన సినిమాలే ఉన్నాయి.

విడుదలకు ముందు బజ్‌ లేకుండా వందల కోట్ల కలెక్షన్స్ నమోదు చేయడం అంటే సాధ్యమయ్యే పని కాదు. కనుక సినిమా విడుదల రెండు మూడు వారాలు ఉండగానే బజ్ క్రియేట్ చేసేలా చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నించాల్సి ఉంది.

వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి సినిమాలు నుండి ఒక్కొక్క పాట చొప్పున విడుదలైన విషయం తెలిసిందే. రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఏ ఒక్క పాటకు కూడా మాస్ ఆడియన్స్ ఊగిపోతూ డాన్సులు వేసేలా టాక్ రాలేదు. అందుకే ముందు ముందు అయినా ఈ రెండు సినిమాలకు పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుందేమో చూడాలి అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక దిల్ రాజు ఎంత తెలుగు సినిమా అంటూ చెప్పే ప్రయత్నం చేసినా కూడా వారసుడు ను డబ్బింగ్ సినిమా గానే తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కనుక ఈ మూడు సినిమాలు సంక్రాంతి వరకు భారీ బజ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే అప్పుడు మంచి కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News