దక్షిణాది అగ్ర కథానాయిక సమంత గత కొన్ని నెలలుగా మైయోసైటిస్ అనే ఆటో ఇమ్యునో వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే సామ్ ఉన్నటుండి తీవ్ర అనారోగ్యానికి గురైందని.. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లుగా ఇప్పుడు నెట్టింట వార్తలు ప్రచారం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సమంత ఆరోగ్యం గురించి వస్తోన్న వార్తలపై ఆమె టీమ్ స్పందించింది. సామ్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైందనే వార్తలను ఖండించారు. ఆమె ఆరోగ్యంగానే ఉందని.. హాస్పిటల్ లో చేరినట్లు వస్తోన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నారు. దీంతో సమంత ఆరోగ్యం గురించి ఆందోళనకు గురైన ఆమె అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇకపోతే మయోసైటిస్ అనే అరుదైన రుగ్మతతో ఇబ్బందిపడుతోన్న సమంత.. గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరమైంది. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా కనిపించలేదు. అయితే వైద్యుల పర్యవేక్షణలోనే 'యశోద' సినిమా డబ్బింగ్ పూర్తి చేసి, రిలీజ్ కు రెడీ చేసింది. ఈ క్రమంలోనే తన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించి అందరినీ షాక్ కు గురి చేసింది. దాని నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పి ఎమోషనల్ అయింది.
ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'యశోద' చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే పోటీగా మరో సినిమా లేకపోవడం సామ్ కు కలిసొచ్చింది. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఆశించిన లాభాలు రాకపోయినా.. నష్టాల నుంచి బయట పడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సమంత అనారోగ్యం కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన సినిమాలు ఆమె రాక కోసం వేచి చూస్తున్నాయి.
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ - సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'ఖుషి' చిత్రం ఇంకా సెట్స్ మీదనే ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందితున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ ఇప్పటికే మెజారిటీ భాగం పూర్తయింది. కొన్ని రోజులు షూటింగ్ చేస్తే సినిమా అంతా అయిపోతుందని అనుకుంటుండగా.. విజయ్ 'లైగర్' ప్రమోషన్స్ కోసం వెళ్లడంతో కాస్త బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.
అదే సమయంలో సమంత ఆరోగ్యం దెబ్బ తినడంతో మళ్ళీ పునః ప్రారంభించడానికి చాలా టైం పడుతోంది. దర్శకుడు శివ నిర్వాణ మరియు హీరో విజయ్ మరో సినిమాకి షిప్ట్ అవ్వకుండా సామ్ కోసం వేచి చూస్తున్నారు. ఈ డిసెంబర్ లో క్రిస్మస్ స్పెషల్ గా ప్లాన్ చేసిన సినిమా.. వచ్చే ఏడాది సమ్మర్ కైనా రెడీ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. కాకపోతే ఆలస్యం కారణంగా వడ్డీలు పెరిగి బడ్జెట్ ఎక్కువ అవ్వొచ్చు. 'యశోద' విషయంలోనూ అదే జరిగింది.
అలానే హిందీ మరియు తమిళ భాషల్లోనూ సమంత కొన్ని ప్రాజెక్ట్స్ కు సైన్ చేసింది. అందులో ఒక వెబ్ సిరీస్ కూడా ఉంది. అంతా బాగుంటే ఈపాటికే వాటిలో కొన్ని సెట్స్ మీద ఉండేవి. ఇప్పుడు సామ్ ఎప్పుడు కోలుకుంటే అప్పుడు షూటింగ్స్ పెట్టుకోవాలని మేకర్స్ వేచి చూస్తున్నారు. కాకపోతే స్టార్ హీరోయిన్ పూర్తిగా ఎప్పుడు కోలుకుంటుందనేది తెలియడం లేదు.
డిసెంబర్ అని ఒకసారి.. జనవరిలో సెట్స్ లో అడుగుపెడుతుందని మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ గ్యాప్ లో సమంత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిందని వచ్చే రూమర్స్ మేకర్స్ ను ఇబ్బంది పెడుతున్నాయని తెలుస్తోంది. సామ్ మైయోసైటిస్ థర్డ్ స్టేజిలో ఉంది. వ్యాధి తీవ్రత కాస్త డిఫికల్ట్ గానే ఉన్నా.. తానున్న స్టేజీ ప్రాణాపాయం మాత్రం కాదని ఇటీవల ఇంటర్వ్యూలో సామ్ తెలిపింది. కాబట్టి త్వరలోనే ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చి అన్ని పనులను పూర్తి చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.