అమెరికాలో థియేట‌ర్లు తెరిచి జోష్ నింపేస్తున్నారు!

Update: 2021-03-15 01:30 GMT
మ‌హ‌మ్మ‌రీ ఎంత‌కాలం ఉంటే అంత కాలం ప‌ని ఆప‌డం కుద‌రనే కుద‌ర‌దు. ఓవైపు వేవ్ కొన‌సాగుతున్నా అమెరికాలో ఇత‌ర కార్య‌క‌లాపాలు ఆగిపోలేదు. ఇక సినీఇండ‌స్ట్రీ నెమ్మ‌దిగా కోలుకుంటోంది. అమెరికాలోని అతిపెద్ద ఫిల్మ్ థియేటర్ చెయిన్ వ్య‌వ‌స్థ‌ల్లో ఒకటైన సినీమార్క్ హోల్డింగ్స్ గ్రేటర్ లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో తన థియేటర్లను తెరవడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతంలోని 10 కి పైగా థియేటర్లు ఈ రోజు నుండి తలుపులు తెరుస్తున్నారు. అన్ని సినిమా హాళ్ళు COVID-19 ప్రోటోకాల్స్ ని భద్రతా నియ‌మాల్ని పాటిస్తున్నాయి.

థియేటర్ల‌ను తిరిగి తెరిచే తేదీల పూర్తి జాబితా టిక్కెట్ల లభ్యత సినీమార్క్ అధికారిక వెబ్ ‌సైట్ లో ఉంచారు. ప్రస్తుతానికి సినీమార్క్ US లో దాని సర్క్యూట్లో 90 శాతం తిరిగి తెరిచింది. ప్రస్తుతం విడుదలైన టామ్ అండ్ జెర్రీ: ది మూవీ- ఖోస్ వాకింగ్- లాంగ్ వీకెండ్- బూగీ- ది కొరియర్ -వండర్ వుమన్ 1984 లతో థియేటర్లు తెరుచుకున్నాయి. అభిమానులు త్వరలో గాడ్జిల్లా Vs కాంగ్- A వంటి రాబోయే చిత్రాలకు టికెట్లను బుక్ చేసుకోగలుగుతారు. సైలెంట్ వ‌ర‌ల్డ్ పార్ట్ 2- మోర్టల్ కోంబాట్ - బ్లాక్ విడో విడుద‌ల కానున్నాయి.

అమెరికా.. యూరప్ .. మిడిల్ ఈస్ట్ ప్రపంచంలో అతిపెద్ద థియేట్రికల్ ఎగ్జిబిటర్లలో ఒకటైన AMC థియేటర్స్.. లాస్ ఏంజిల్స్ లోని రెండు ప్రధాన ప్రదేశాలు.. AMC బర్బ్యాంక్ 16 ..AMC సెంచరీ సిటీ 15.. మార్చి 15 సోమవారం మధ్యాహ్నం నుంచి తిరిగి తెరుస్తున్నారు. లాస్ ఏంజిల్స్ కౌంటీలో మిగిలిన 23 సినిమా థియేటర్లను మార్చి 19 నుండి తిరిగి తెరవాలని AMC యోచిస్తోంది. స్థానిక అధికారుల నుండి అనుమతి పొందిన తరువాత కాలిఫోర్నియా ప్రాంతంలోని తన 56 ప్రదేశాలను తిరిగి తెరవడానికి AMC వేచి చూస్తోంది. ఏదేమైనా అమెరికాలో థియేట‌ర్ల‌ను తెర‌వ‌డం టాలీవుడ్ లోనూ ఉత్సాహం నింపేదే.




Tags:    

Similar News