కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావంతో థియేటర్లు మూత వేసేస్తారని ప్రచారం సాగుతోంది. ఈనెల మూడో వారం నుంచి థియేటర్లను బంద్ చేయడానికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని మీడియా కథనాలొచ్చాయి. మరోవైపు ఏపీలో 50శాతం సీటింగ్ కే అనుమతులున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి రాత్రి వేళ్లలో కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకు కరోనా కర్ఫ్యూ కొనసాగుతుంది. ఇకపై రాత్రి ఎనిమిది గంటల వరకే రెస్టారెంట్స్- బార్స్- పబ్స్- క్లబ్స్- షాపులకు పరిమితులుంటాయి. అత్యవసర రంగం మినహా ఇతర రంగాల పరిస్థితి ఇదే. అయితే ఈ సన్నివేశంలో మునుముందు థియేటర్లను మూసి వేస్తారని భావిస్తున్నారు. ఇది నిజమా? అంటే .. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వం థియేటర్లను బంద్ చేయాల్సిన అవసరమే లేదనేది పరిశ్రమ పెద్దల వాదన.
పెరుగుతున్న భయాల వల్ల అసలు జనాలే థియేటర్లకు రారు అని నిర్ణయించుకుని చాలామంది సినిమాల రిలీజుల్ని వాయిదా వేశారు. వకీల్ సాబ్ తర్వాత వేరే ఏ సినిమాలు రావడం లేదు. వచ్చినవి ఆడలేదు. అసలు సినిమాలు రిలీజ్ చేసేవాళ్లే లేనప్పుడు థియేటర్లు తెరిచి ఉంచుతారా? అని ఎగ్జిబిషన్ దిగ్గజం అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు అన్నారు. వకీల్ సాబ్ తొలి వారం చక్కని వసూళ్లు చేసినా ఆ తర్వాత ఆడకపోవడానికి జనాలు థియేటర్లకు వచ్చేందుకు భయపడడమేనని అన్నారు. వందలాది థియేటర్లకు అసలు కంటెంట్ అన్నదే లేదని.. అందువల్ల మూసివేత తప్పదని సురేష్ బాబు తెలిపారు. ఒక చిన్న సినిమా వస్తోంది. దాని వరకూ 300 థియేటర్లు చాలు .. మిగతా 1500 థియేటర్లకు కంటెంట్ లేదని సురేష్ బాబు అన్నారు.
50శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు ఆడాలి అని ప్రభుత్వం చెప్పాల్సిన పనే లేకుండా జనం 25 శాతానికి మించి థియేటర్లకు రావడం లేదని నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ పి.రామ్మోహన్‌రావు అన్నారు. ఏప్రిల్ 30న మున్సిపాలిటీ ఎన్నికలున్నాయి. ఆ ఎన్నికలు అయ్యే వరకు థియేటర్స్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోదని ఫుల్ రన్ సగం రన్ పైనా నిర్ణయం ఉండదని అన్నారు. థియేటర్లు మూసేయడంపై ప్రభుత్వ జోక్యం ఉండదని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయంతో 50శాతంతోనే ఇకపై ఏపీలో థియేటర్లు రన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలంగాణలో నైట్ కర్ఫ్యూతో థియేటర్ రంగం తీవ్రంగా నష్టపోతుంది అని ఏషియన్ గ్రూప్స్ సీఈవో అన్నారు. అయినా జనాలకు కరోనా వ్యాక్సినేషన్ వేగంగా పూర్తి చేస్తే అన్ని రంగాలు ఈ విపత్తు నుంచి బయటపడగలవని అన్నారు. గత ఏడాది అంటే కరోనాకు టీకా లేదు. ప్రస్తుతం కోవిడ్ నివారణకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. అందరికీ టీకాలు వేస్తే వ్యాధి తీవ్రత తగ్తుతుంది. కరోనాకు టీకానే పరిష్కారం.. కానీ అది త్వరగా అవ్వడం లేదు అని అన్నారు.