టాలీవుడ్ లో హాస్య నటులు దర్శకత్వం వహించడం కొత్తేమి కాదు. గతంలో ఎందరో ప్రయత్నాలు చేశారు. నిర్మాతలుగా కొందరికి చేతులు కాలితే డైరెక్టర్లుగా టైటిల్ కార్డు వేసుకోవడం మినహా పెద్దగా ఫలితం దక్కని వారూ ఉన్నారు. ఏంఎస్ నారాయణ కొడుకు-భజంత్రీలు పేరుతో రెండు ప్రయత్నాలు చేస్తే దారుణమైన ఫలితాలు ఇచ్చాయి. ఎప్పుడైనా టీవీలో వచ్చినప్పుడు పేరు చూసి తీసింది ఈయనా అని ఆశ్చర్యపోయినవారు ఎందరో.
ఇలాగే ఏవిఎస్ సూపర్ హీరోస్-అంకుల్ అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. రిజల్ట్ సేం. ఒకదాన్ని మించి మరొకటి టపా కట్టేశాయి. ధర్మవరపు సుబ్రహ్మణ్యం రెండు తోకల పిట్ట అనే సినిమా సీనియర్ నరేష్ హీరోగా పెట్టి తీస్తే పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. ఇవన్ని గమనిస్తే కమెడియన్లు దర్శకులుగా మారడం ఈజీ కాని ఫలితాలు సాధించడం ఎంత కష్టమో అర్థమవుతుంది
ఇప్పుడు ఇదే తరహా రిస్క్ కు రెడీ అవుతున్నాడు కమెడియన్ శ్రీనివాస రెడ్డి. భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు పేరుతో ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ పూర్తయిపోయింది. సీనియర్ల నుంచి జూనియర్ల దాకా దాదాపు అందరూ నటిస్తున్న ఈ మూవీని ఫ్లయింగ్ కలర్స్ పేరుతో తమ బ్యాచుకు పెట్టుకున్న పేరుతోనే సంయుక్తంగా బ్యానర్ పెట్టి నిర్మాతలుగా మారారు.
కెప్టెన్ గా శ్రీనివాసరెడ్డిని ఎంచుకున్నారు. రేపో మాపో దీనికి సంబంధించిన ప్రకటన రానుంది. సో టాప్ మోస్ట్ కమెడియన్స్ ఫెయిల్ అయిన విభాగంలో శ్రీనివాస రెడ్డి తానేంటో రుజువు చేసుకోవాల్సి ఉంది. టైటిల్ చాలా ఫన్నీగా ఉంది. దానికి తగ్గట్టే కామెడీ ఉంటే మాత్రం థియేటర్లో పూసే నవ్వులే వసూళ్లుగా మారతాయి.