ఒకప్పుడు సంక్రాంతికి కనీసం నాలుగు సినిమాలు బరిలో ఉండేవి. పెద్ద పెద్ద హీరోల సినిమాలకు కూడా ఏ ఇబ్బందీ లేకుండా పోటీకి సై అనేవి. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారిపోయింది. ఒకట్రెండు పెద్ద సినిమాలకు మించి రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడంతా సినిమాల కలెక్షన్లంతా తొలి రెండు వారాల మీదే ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఎక్కువ సినిమాలు పోటీ పడితే అందరికీ నష్టమే అని భావించి... ఒక అండర్ స్టాండింగ్ తో రిలీజ్ డేట్లు సర్దుబాటు చేసుకుంటున్నారు నిర్మాతలు. కానీ ఈ ఏడాది సంక్రాంతికి మాత్రం అలాంటి అడ్జస్ట్ మెంట్లు జరగలేదు. ఒకేసారి నాలుగు పేరున్న సినిమాలు రిలీజయ్యాయి. ఆ నాలుగూ వేటి స్థాయిలో అవి బాగానే ఆడాయి.
ఇక వచ్చే ఏడాది కూడా ఇలాగే సంక్రాంతికి గట్టి పోటీ తప్పేలా లేదు. అందులోనూ ఈసారి పోటీ చూస్తుంటే దీన్ని క్లాష్ ఆఫ్ టైటాన్స్ గా అభివర్ణించాలేమో. ఇంకో 8 నెలల సమయం ఉండగానే రెండు మోస్ట్ అవైటెడ్ మూవీస్ సంక్రాంతికి బెర్తులు కన్ఫమ్ చేసుకోవడం విశేషం. బాలయ్య కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి అప్పుడే డేట్ కూడా ప్రకటించేశారు. 2017 జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. మరోవైపు చిరంజీవి ప్రెస్టీజియస్ రీఎంట్రీ మూవీని కూడా సంక్రాంతికే విడుదల చేయబోతున్నట్లు నిన్న ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించారు.
ఒకప్పుడు చిరంజీవి-బాలయ్య మధ్య సంక్రాంతి పోరు రసవత్తరంగా ఉండేది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వాళ్లిద్దరి మధ్య పోరు చూడబోతున్నాం. ఇంకో వైపు చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతి మీద కన్నేశాడు. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో చేయబోతున్న తన తర్వాతి సినిమాను సంక్రాంతికే తేవాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్-వక్కంతం వంశీ సినిమా టార్గెట్ కూడా సంక్రాంతే. ఐతే ఈ రెండు సినిమాలు కొంచెం అనుమానమే కానీ.. చిరంజీవి-బాలయ్య మాత్రం సంక్రాంతికి పోటీకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.