టోక్యో ఒలింపిక్స్: టీమిండియా క్రీడాకారులకు RRR టీమ్ స్పెషల్ విషెస్..!

Update: 2021-07-22 07:30 GMT
జపాన్ రాజధాని టోక్యో కేంద్రంగా 'ఒలింపిక్ గేమ్స్-2021' జరగనున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లలో సారి జరిగే ఈ మెగా ఈవెంట్‌ కోవిడ్ నేపథ్యంలో ఈసారి ఏడాది ఆలస్యంగా జరుగుతుంది. ఇందులో భారతీయ క్రీడాకారులు కూడా ప‌లు విభాగాల్లో పాల్గొననున్నారు. రియో ఒలింపిక్స్‌ గేమ్స్-2016 లో కేవ‌లం రెండు పతకాలు సాధించిన ఇండియా.. ఈసారి ఎక్కువ మెడల్స్ గెలవాలనే పట్టుదలతో బరిలో దిగుతోంది. మరికొన్ని గంటల్లో అతిపెద్ద క్రీడా సంబరం 'ఒలింపిక్స్‌' ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ క్రీడాకారులకు సోష‌ల్ మీడియా వేదిక‌గా అందరూ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'RRR' చిత్ర బృందం కూడా ఒలింపిక్స్ లో పాల్గొనే టీమిండియా క్రీడాకారులకు విషెస్ తెలియ‌జేసింది.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రం నుంచి ఓ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి.. ఇండియన్ ప్లేయర్స్ కి శుభాకాంక్షలు తెలిపారు. 'టోక్యో ఒలింపిక్స్-2021' లో పాల్గొనే భారత బృందాన్ని ఉత్సాహపరిచేందుకు మేము నేషన్ తో జాయిన్ అవుతున్నాం. ఇది మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిభావంతులైన అథ్లెట్ల కోసం. ఇండియన్ ఒలింపియన్స్ మేము మీతో ఉన్నాం. #Cheer4India'' అని RRR టీమ్ సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ లకు సంబంధించిన ఓ షాడో పోస్టర్ ని వదిలింది. ఒలింపిక్స్ లోగో బ్యాగ్రౌండ్ లో కనిపిస్తున్న ఈ ఫొటోలో RRR హీరోలు చేతిలో గన్ - బల్లెం - విల్లు పట్టుకొని ఉన్నారు. స్పెషల్ పోస్టర్ ద్వారా టీమిండియా క్రీడాకారులకు విషెస్ అందించడం క్రీడా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

కాగా, దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రణం రుధిరం'. ఇందులో 'కొమురం భీమ్' గా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ఆలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అక్టోబ‌ర్ 13న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News