ఇప్పుడు సినీ వర్గాల్లో స్టార్ హీరోల మధ్య జరిగిన రహస్య సమావేశం గురించే చర్చ జరుగుతోంది. అందులో ఏం మాట్లాడుకున్నారు ఏ నిర్ణయం తీసుకున్నారు అనే దాని గురించి రకరకాల వార్తలు ప్రచారం అవుతున్న నేపధ్యంలో ఏది నిజమో ఏది అబద్దమో తెలియని అయోమయం లో ఉన్నారు. ముఖ్యంగా న్యూస్ ఛానల్స్ కు ఇకపై ఎటువంటి ఫీడ్ ఇవ్వకూడదు అనే డెసిషన్ తీసుకున్నట్టుగా వచ్చిన వార్త మీడియాలో కలకలం రేపింది. నిజమో కాదో నిర్ధారించుకోవడానికి అధికారిక ప్రకటన ఏది లేకపోవడంతో అది కాస్త వైరల్ గా మారింది. నిజానికి కొన్ని ఛానల్స్ చేస్తున్న ఓవర్ యాక్షన్ గురించి సమావేశంలో ఎటువంటి చర్చ జరగలేదని సమాచారం. అసలు ఆ పాయింట్ ఇప్పుడు చర్చించాల్సింది కాదని చిరంజీవితో సహా పలువురు పెద్దలు అభిప్రాయ పడటంతో అది డ్రాప్ అయ్యారట.
చర్చ మొత్తం ఈ మధ్య టాలీవుడ్ పరువును జాతీయ మీడియాలో తీసే దాకా వెళ్ళిన కాస్టింగ్ కౌచ్ గురించే అని వినికిడి. హీరో హీరొయిన్లు తమ మేనేజర్ల మీదే భారం వదిలేసి మిగిలిన విషయాలు పట్టించుకోకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్న మాట వాస్తవమే అని ఒప్పుకున్నట్టు తెలిసింది. నటీనటుల మంచితనాన్ని ఆసరాగా తీసుకుని కొందరు మేనేజర్లు కం కో ఆర్డినేటర్లు లైంగిక వేధింపులకు పాల్పడటం గురించి ఈ సందర్భంగా చర్చలో మాట్లాడినట్టు సమాచారం. ఇకపై అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా హీరోలు తమ కనీస బాధ్యతగా తమతో నటిస్తున్న సహ నటీనటులు చిన్నవారైనా పెద్దవారైనా ఓ కంట కనిపెడుతూ ఉంటే వాళ్ళు రక్షణగా ఫీల్ అవుతారని చెప్పినట్టు సమాచారం. రెమ్యునరేషన్ తీసుకుని నటించడం వరకే మన పని అనుకోవడం వల్లే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చిందని చర్చకు పెద్దరికం తీసుకున్న చిరంజీవి హితవు పలికినట్టు తెలిసింది. పవన్ కళ్యాణ్ ఇష్యూ కూడా మాటల్లో ప్రస్తావనకు వచ్చినా అది తర్వాత చూద్దామని ఉపేక్షించేది అయితే కాదని దాని నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు వినికిడి.
మొత్తానికి రానున్న రోజుల్లో కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి ఎటువంటి వివాదాలు చెలరేగకుండా తీసుకునే చర్యల గురించే సమావేశంలో మాట్లాడుకున్నట్టు తెలిసింది. న్యూస్ ఛానల్స్ బ్యాన్ గురించి కాని వాటికి ఆంక్షలు విధించడం గురించి కాని ఎలాంటి మాట అనుకోలేదని తెలిసింది. ఇప్పటికి ఆ విషయం పక్కన పెడదామని ఒకవేళ ఇదే ధోరణి రానున్న రోజుల్లో ఏ మాత్రం కనిపించినా అప్పుడు కఠినంగా వెళ్ళడం గురించి ఆలోచిద్దామని కొందరు పెద్దలు సూచించడంతో అందరు దానికే మొగ్గు చూపినట్టు ఇన్ సైడ్ టాక్.