యుఎస్ బాక్సాఫీస్ టాప్-10 ఇవే

Update: 2016-02-06 17:30 GMT
ఒకప్పుడు యుఎస్ లో తెలుగు సినిమా విడుదల కావడమే గగనంగా ఉండేది. అలాంటిదిప్పుడు నైజాం తర్వాత తెలుగు సినిమాకు అతి పెద్ద మార్కెట్ గా మారిపోయిందా ఏరియా. గత ఐదారేళ్ల నుంచి యుఎస్ బాక్సాఫీస్‌ లో సత్తా చాటుతున్న తెలుగు సినిమా.. గత ఏడాది అక్కడి ట్రేడ్ పండిట్స్ కూడా మనవైపు చూసేలా కాలర్ ఎగరేసింది. బాహుబలి సినిమా ఏకంగా 8 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఔరా అనిపిస్తే.. మహేష్ సినిమా 2.8 మిలియన్ల దాకా వసూలు చేసి తన ప్రత్యేకతను చాటుకుంది. తాజాగా ఎన్టీఆర్ మూవీ ‘నాన్నకు ప్రేమతో’ కూడా రెండు మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరి తెలుగు సినిమా సత్తాను చాటింది. ఈ నేపథ్యంలో యుఎస్ బాక్సాఫీస్‌ లో టాప్-10 సినిమాలేవో చూద్దాం.

1. బాహుబలి (8 మిలియన్లు)
2. శ్రీమంతుడు (2.8 మిలియన్లు)
3. నాన్నకు ప్రేమతో (2 మిలియన్లు)
4. అత్తారింటికి దారేది (1.9 మిలియన్లు)
5. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (1.6 మిలియన్లు)
6. దూకుడు (1.56 మిలియన్లు)
7. మనం (1.5 మిలియన్లు)
8. భలే భలే మగాడివోయ్ (1.45 మిలియన్లు)
9. ఆగడు (1.4 మిలియన్లు)
10. రేసుగుర్రం (1.3 మిలియన్లు)
Tags:    

Similar News