పెళ్లి అనే పదమే మన కథానాయికలకు బోర్ కొట్టేసింది. అసలు ఆ పదం వింటనే ఇర్రిటేషన్ ఫీలైపోతున్నారు. ప్రేమ, దోమా, పెళ్లి, పటాస్ అంటూ ఎవరైనా ప్రశ్న వేస్తే వెంటనే వెకిలిగా ఓ నవ్వు నవ్వేసి పుచ్చు వంకాయ్‌ని చూసినట్టు చూస్తున్నారు.
మొన్ననే పెళ్లి గురించి అనుష్కను ప్రశ్నిస్తే .. నా డ్రీమ్‌బోయ్ దొరికినప్పుడు అందుకు సిద్ధమేనంది. మరి ప్రేమించలేదా? అంటే ఇంత లాంగ్ జర్నీలో ప్రేమలో పడకుండా ఉంటామా? అంది. మరి ప్రియుడు ఎవరో? అని ప్రశ్నిస్తే ఎవరో తర్వాత చెబుతానని దాటవేసింది. ఇలా దేనికదే పొంతనలేని సమాధానాలతో విసిగించింది.
లేటెస్టుగా అలాంటి సందర్భమే అందాల ఛార్మికి వచ్చింది. పెళ్లి అన్న మాట ఎత్తగానే.. ఆ పదమే బోర్ కొట్టేసింది. అయినా నాకు స్వతహాగా కొంచెం పిచ్చి. ఆ పిచ్చిని అమ్మా నాన్న అయితేనే భరిస్తారు. కానీ చేసుకునేవాడు భరించడం కష్టమేనని చెప్పింది. అందుకే చేసుకోవడం లేదనీ సెలవిచ్చింది. ఇదే ప్రశ్న అందాల సమంతని అడిగితే ఏమందో తెలుసా? కెరీర్ హ్యాపీ ఉంది. ఎందుకు కష్టాలు. సింగిల్‌గానే హ్యాపీగా ఉన్నా. ముందు సంపాదన, కెరీర్. తర్వాతే ఏదైనా. పెళ్లికి టైమ్ పడుతుంది అంటూ చెప్పింది. సిద్ధార్థ్ గురించి అడిగితే మీకు తెలిసిందేగా.. అనీ దాటవేసింది.
అలాగే మరో కథానాయిక నయనతార ముందు పెళ్లి అనే పదం ఎత్తాలంటేనే భయపడి చస్తున్నారంతా. ఇప్పటికే రెండుసార్లు పరాభవం ఎదుర్కొన్న ఈ భామను పెళ్లి గురించి ప్రశ్నిస్తే సీరియస్ అయిపోతుంది. ఈ భామల వాలకం పరిశీలించాక కథానాయికల్ని అడగకూడని ప్రశ్న ఏదైనా ఉందీ అంటే అది 'పెళ్లి' అనే అర్థం చేసుకోవాలి.