ఈరోజుల్లో కొడుకులంతా హీరోలైపోతున్నారు. బిడ్డడు భూమ్మీద పడడం ఆలస్యం హీరోగా చూసుకుందామని ప్రతి తండ్రీ ఇదైపోతున్నారు. అయితే ఇలా కలలు గనేది కామన్‌మేన్ కాదులెండి. సినిమానే తిని, సినిమానే శ్వాసించి బతికే మన దర్శదిగ్గజాలు. మన దర్శకుల బిడ్డలంతా హీరోలైపోతున్నారు తప్ప దర్శకులు మాత్రం కావడం లేదు.
ఇప్పటికిప్పుడు లెక్కలు తీస్తే టాలీవుడ్‌లో అరడజను పైగానే స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. వీళ్లంతా దశాబ్ధ కాలంగా సినిమాలు తీస్తూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. బోలెడన్ని బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని ఇచ్చి మనసు దోచారు. అయితే అంత చేసిన ఈ స్టార్ డైరెక్టర్ల శిష్యుల నుంచి వారసులుగా ఒక్కరూ స్టార్ డైరెక్టర్ కాలేకపోతున్నారు. వీళ్ల దగ్గర పనిచేసిన అసోసియేట్‌లు కానీ, కో, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ డైరెక్టర్లుగా విరాజిల్లలేకపోతున్నారు. కారణం ఏదైనా ఇది మాత్రం సత్యం. అయితే ఇప్పుడు డాక్టరు బిడ్డ డాక్టరు అయిన చందంగా ఈ డైరెక్టర్ల కొడుకులైనా డైరెక్టర్లు అవుతారనుకుంటే అస్సలు ఛాన్సే లేదు.
ఇప్పటికే కోదండరామిరెడ్డి కొడుకు వైభవ్ హీరో అయ్యాడు. ఏమయ్యాడో అందరికీ తెలుసు. కె.రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి కూడా హీరో అవ్వాలనే చతికిలబడ్డాడు. దాసరి నారాయణరావు కొడుకు అరుణ్‌కుమార్ కూడా అంతే. ఈవీవీ చిన్నకొడుకు నరేష్ డైరెక్టర్ కాబోయి హీరో అయ్యాడు. పెద్ద కొడుకు ఆర్యన్ నేరుగా హీరోనే అయ్యాడు. ఇప్పుడు పూరీ కొడుకు ఆకాష్ కూడా హీరో అయిపోతున్నాడు. త్రివిక్రమ్, సుకుమార్ కొడుకులు ఇంకా చిన్నపిల్లలు. వీళ్లు కూడా తప్పకుండా హీరోలే. కాబట్టి ఇక ఎప్పటికీ స్టార్ డైరెక్టర్ల బిడ్డలు డైరెక్టర్లు అయ్యే అవకాశమే లేదు. అయితే వీళ్లంతా ఏం వెలగబెడతారోగానీ, వీళ్లందరికంటే డిఫరెంట్‌గా రాజమౌళి ఆలోచిస్తున్నాడు.
కొడుకు కార్తికేయకి ఇప్పట్నుంచే ఆన్‌సైట్ ప్రాక్టికల్ అనుభవాన్నిస్తున్నాడు. దర్శకత్వం, కెమెరా, విఎఫ్‌ఎక్స్‌లో నేరుగా అనుభవ పాఠాల్ని నేర్పిస్తున్నాడు. ప్రాక్టికల్ అనుభవాన్ని కూరేస్తున్నాడు. కార్తికేయ డైరెక్టర్ అవ్వడు అంటూనే అన్నీ నేర్పించేస్తున్నాడు. మొన్న వచ్చిన బాహుబలికి మనోడు సెకండ్ యునిట్ డైరక్టర్. వేరే డైరెక్టర్ల కొడుకులు ఎలానూ డైరెక్టర్లు కాలేరు కాబట్టి భవిష్యత్‌లో కార్తికేయనే టాలీవుడ్‌ని ఏలే నెం.1 దర్శకుడు అనుకోవచ్చేమో.