ఈ వారం రెండు క్రేజీ ప్రాజెక్టులు థియేటర్లలోకి వచ్చాయి. రెండింటికీ మిక్సెడ్ టాక్ వచ్చినా.. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి.
1. బాబు బంగారం : వెంకీ-నయనతార జంటగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన బాబు బంగారం.. ఈవారం టాప్ లో ఉంది. తొలివీకెండ్ చివరకే ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. వెంకీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సోమవారం కూడా ఈ జోరు కొనసాగనుంది.
2. తిక్క: సుప్రీమ్ తో సాలిడ్ హిట్ కొట్టి సాయిథరం తేజ్.. ఈసారి తిక్క చూపించాడు. శనివారం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి.. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. అయితే భారీ రిలీజ్ కారణంగా.. రెండు రోజుల వసూళ్లకే లిస్ట్ టాప్ 2లో చేరిపోయింది.
3. శ్రీరస్తు శుభమస్తు: కంటెంట్ బాగుండడం.. ఫ్యామిలీ మూవీ కావడంతో.. శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ఈ వారం చిత్రాలు నిరుత్సాహపరచడంతో అల్లు శిరీష్ మూవీ పుంజుకునే ఛాన్స్ ఉంది.
4. పెళ్లిచూపులు: చిన్న సినిమా అయిన పెద్ద హిట్ సాధించిన పెళ్లిచూపులు తెలుగురాష్ట్రాల్లో కలెక్షన్స్ కాస్త డల్ గానే ఉన్నాయి. థియేటర్ల సంఖ్య పరిమితంగా ఉండడమే ఇందుకు రీజన్ గా చెప్పచ్చు. యూఎస్ లో ఇప్పటికే 900k కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ.. మిలియన్ డాలర్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
5.మనమంతా: చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రానికి టాక్ బాగున్నా.. కలెక్షన్స్ మాత్రం లేవు. ఊపందుకుంటాయనే ఆశలు కూడా కనిపించడం లేదు. సరైన పబ్లిసిటీ చేయకపోవడం మనమంతాకు చేటు చేసింది.