నాకు తిక్కరేగితే అంతే: శర్వానంద్
శర్వానంద్ హీరోగా 'ఒకే ఒక జీవితం' సినిమా రూపొందింది. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అమల అక్కినేని కీలకమైన పాత్రలో కనుపించనున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రలను వెన్నెల కిశోర్ .. ప్రియదర్శి పోషించారు. వచ్చేనెల 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ ఉండటంతో, ప్రమోషన్స్ తో శర్వానంద్ బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'జాను' సినిమా సమయంలో జరిగిన ప్రమాదం వలన గ్యాప్ తీసుకోవడం వలన నేను లావుకావడం జరిగింది. వరుసగా ఎదురవుతున్న ఫ్లాపుల కారణంగా ఒక 6 నెలల గ్యాప్ తీసుకుందామని నేను నిర్ణయించుకున్నాను.
గతంలో నేను మాత్రమే కథలు వినేవాడిని. కానీ ఇప్పుడు నా సన్నిహితులకు కూడా వినిపించి, వాళ్ల అభిప్రాయం కూడా తీసుకుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. నా ఫ్లాప్ సినిమాల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నా సినిమాల్లో ఏ సినిమా ఏ కారణంగా ఫ్లాప్ అయిందనేది నేను చెప్పగలను. ఒకసారి జరిగిన పొరపాటు మరోసారి జరక్కుండా చూసుకుంటాను. నా సినిమాలు ఫ్లాప్ అయితే అందుకు వేరే వారిని బాధ్యులను చేయను. అందుకు కారణం నేనే అని చెబుతాను. ఎందుకంటే నన్ను నమ్ముకునే నిర్మాతలు సినిమాలు చేస్తారు గనుక.
నా కెరియర్ విషయంలో మా పేరెంట్స్ జోక్యం చేసుకోరు. మనకి ఇన్ని ఆస్తిపాస్తులున్నాయి కదా, నువ్వు కష్టపడవలసి అవసరం లేదు అని వాళ్లు ఎప్పుడూ చెప్పలేదు. నువ్వు కష్టపడి నీ సంపాదన నువ్వు సంపాదించుకోవాలనేదే వాళ్లు నాకు నేర్పించారు. అందుకు తగినట్టుగానే నా 19వ ఏట నుంచి ఇంతవరకూ నేను వాళ్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అదే నేను సాధించిన సక్సెస్ గా భావిస్తున్నాను.
నేను నా పారితోషికం విషయంలో నిర్మొహమాటంగా ఉంటానని ఒక నిర్మాత ప్రచారం చేస్తున్నాడు. నిజమే నేను నా పారితోషికం తగ్గించుకోలేను .. అలా చేసి నన్ను నేను తగ్గించుకోలేను. మార్కెట్ ఉంటేనే కదా నిర్మాతలు డబ్బులు ఇస్తారు. అలాంటప్పుడు ఇలాంటి ప్రచారాలు చేయకూడదు. మీరు ఈ ప్రశ్న అడగడానికి కారణమైన ఆ నిర్మాత డబ్బులు ఇవ్వకపోయినా నేను డబ్బింగ్ చెప్పాను. నా సినిమా వలన ఆ సినిమాకి ఎంత లాభం వచ్చిందో కూడా నాకు తెలుసు. నన్ను మోసం చేయడానికి ట్రై చేస్తే మాత్రం నేను ఎంత మాత్రం సహించను. నాకు తిక్కరేగిందంటే నేను ఎవరినీ లెక్క చేయను.
నాకంటూ ఒక మార్కెట్ ఉంది .. దానికి తగినట్టుగానే నేను తీసుకుంటున్నాను. అలాగని చెప్పేసి డబ్బుకోసమే సినిమాలు చేయవలసిన అవసరం కూడా నాకు లేదు. అవసరమైతే సొంత సినిమాలు తీసుకోగలను .. కాకపోతే ఈ మాట చెబితే అహంభావంతో అన్నట్టుగా ఉంటుంది. పెద్ద దర్శకులతో చేయాలని నాకూ ఉంది.అలాంటి అవకాశం త్వరలోనే వస్తుందని అనుకుంటున్నాను. 'ఒకే ఒక జీవితం' సినిమా కొత్తగా ఉంటుంది. జీవితంలో కోల్పోయిన కొన్ని అనుభూతులను వెనక్కి వెళ్లిపొందడానికి ప్రయత్నించడమే కథ. ఈ సినిమా నా కెరియర్ లో చెప్పుకోదగినది అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.