రైతు ఉద్యమంలో విషాధం..రైతు ఆత్మహత్య

Update: 2021-02-07 16:30 GMT
వ్యవసాయ చట్టాల రద్దు కోసం జరుగుతున్న ఉద్యమంలో విషాధం చోటు చేసుకుంది. చట్టాల రద్దు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రైతు మొదటినుండి రైతు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలైన సింఘూ, ఘజీపూర్, టిక్రీ ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. జనవరి 26వ తేదీన ఢిల్లీ వీధుల్లో జరిగిన అల్లర్ల తర్వాత ఉద్యమం ప్రభావం తగ్గిపోతుందని అనుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఉద్యమం రూపు మార్చుకుని మరింత ఉధృతంగా పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే టిక్రీ ప్రాంతంలో ఉద్యమం జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోనే 52 ఏళ్ళ రైతు చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

బలన్మరణానికి పాల్పడిన రైతును హర్యానా జిల్లాలోని జిండ్ తాలూకాకు చెందిన కరమ్ వీర్ సింగ్ గా గుర్తించారు. సంఘటనా స్ధలంలో దొరికిన సూసైడ్ లేఖలో కేంద్రం వైఖరితో విసిగిపోయి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసుందని సమాచారం. రైతులను మోసం చేసే ఉద్దేశ్యంతోనే నరేంద్రమోడి ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందంటు రైతు ఆవేధన వ్యక్తంచేశారు. రైతు తాజా ఆత్మహత్యతో ఇప్పటివరకు గడచిన రెండున్నర మాసాల్లో సుమారు 200 మంది రైతులు చనిపోయినట్లు రైతుసంఘాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News