హారర్ ఘోరం బాబోయ్

Update: 2015-11-11 04:34 GMT
దెయ్యాల గోల ఈ మధ్య బాగా ఎక్కువయిపోయింది. గతంలో దెయ్యాల సినిమాలన్నీ వణికించే టైపులోనే ఉంటాయి. ఈ మధ్య దీనికి కామెడీని మిక్స్ చేసి.. హారర్ కామెడీల పేరుతో జనాలపైకి వదిలేస్తున్నారు. ఈ ఫార్ములా బాగానే వర్కవుట్ అవుతుండడంతో.. సీక్వెల్స్ కూడా క్యూ కట్టేస్తున్నాయి.

గతేడాది అరణ్మణై అంటూూ తమిళ్ లో ఓ మూవీ వచ్చింది. రాయ్ లక్ష్మీ హీరోయిన్ కాగా.. హన్సిక దెయ్యంగా కనిపిస్తుంది ఈ మూవీలో. తెలుగులో చంద్రకళగా వచ్చి బాగానే ఆడిందీ మూవీ. సి. సుందర్ లాంటి సీనియర్ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ మూవీ.. పెట్టుబడికి రెట్టింపు రాబట్టేసింది. దీంతో ఇప్పుడీ అరణ్మణైకి సీక్వెల్ సిద్ధమైపోయింది.

సీక్వెల్ కదా.. అందుకే అందాల జోరు.. దెయ్యాల హోరు పెంచేశాడు డైరెక్టర్. సిద్ధార్ధ్ ని హీరోగా తీసుకుని.. త్రిష - హన్సిక - పూనమ్ బజ్వాలను హీరోయిన్స్ గా పట్టుకొచ్చాడు. ఇప్పుడీ మూవీకి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. మొదటిపార్ట్ తీసిన భారీ ఇంటినే మరింత భయంకరంగా డిజైన్ చేశారు. పాటల్లోనూ దెయ్యాలే, సినిమా అంతా దెయ్యాలే, ముగ్గురు భామల్లో ఎవరు దెయ్యమో అర్ధం కాకుండా ఉంది. చూస్తుంటే ప్రేక్షకులకు హారర్ - కామెడీతోపాటు ఈసారి థ్రిల్ కూడా ప్లాన్ చేశారనిపిస్తోంది. ప్రధాన నటీనటులందరూ టాలీవుడ్ కి బాగా తెలిసినవాళ్లే కావడంతో.. ఇది చంద్రకళ 2 అంటూ వచ్చేయచ్చు.

Tags:    

Similar News