భీమ్లా విషయంలో త్రివిక్రమ్‌ ఫుల్‌ హ్యాపీస్‌

Update: 2022-02-27 05:30 GMT
పవన్‌ కళ్యాణ్ 'భీమ్లా నాయక్‌' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అభిమానులు ఆనందంకు అవధులు లేవు. గత చిత్రం వకీల్‌ సాబ్ పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకున్నా కూడా కరోనా ఇతర కారణాల వల్ల సినిమా ను కొద్ది మంది మాత్రమే చూశారు.

కాని ఇప్పుడు భీమ్లా నాయక్‌ భారీ ఎత్తున విడుదల అయ్యి రికార్డు స్థాయి ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ ను దక్కించుకుంది. మొదటి మూడు రోజుల వసూళ్లు సరికొత్త రికార్డును నమోదు చేయబోతున్నాయి.

ఈ సినిమా మలయాళం అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ కు రీమేక్ అయినా కూడా ఆ మార్క్‌ కనిపించకుండా.. పక్కా కమర్షియల్‌ మూవీగా దర్శకుడు త్రివిక్రమ్‌ మార్చేశాడు. ఆయన రాసిన స్క్రిప్ట్‌ దర్శకుడు సాగర్ కే చంద్ర పనిని ఈజీగా మార్చేశాయి.

ప్రతి ఒక్క సన్నివేశం కూడా పవన్ ఇమేజ్ కు తగ్గట్లుగా తెరకెక్కించడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ఘన విజయంతో దర్శకుడు సాగర్‌ కే చంద్ర కంటే ఎక్కువగా త్రివిక్రమ్‌ సంతోషంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.

పవన్ కళ్యాన్ కు అజ్ఞాతవాసి అంటూ అట్లర్‌ ప్లాప్ సినిమాను ఇవ్వడంతో త్రివిక్రమ్‌ పై అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే భీమ్లా నాయక్ కోసం త్రివిక్రమ్‌ చాలా కష్టపడ్డాడు. తాను దర్శకత్వం చేసిన సినిమా కంటే కూడా అధికంగా త్రివిక్రమ్‌ వర్క్ చేశాడని యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. నిర్మాణ వ్యవహారాలు మొదలుకుని సంగీతం ఎడిటింగ్ విజువల్‌ ఎఫెక్ట్స్ ఇలా ఎన్నో విషయాలపై త్రివిక్రమ్‌ వర్క్‌ చేశాడు.

థమన్‌ తో సమన్వయం చేస్తూ అద్బుతమైన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ మరియు పాటలను చేయించాడు. పవన్‌ ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు త్రివిక్రమ్‌ సినిమా మేకింగ్‌ విషయంలో సాగర్ కే చంద్రకు సలహాలు ఇస్తూ వచ్చాడు. రెగ్యులర్‌ గా షూటింగ్‌ కి హాజరు అవుతూ ఏం జరుగుతుంది అనేది చూసుకుంటూ భీమ్లా నాయక్ విజయంలో త్రివిక్రమ్‌ కీలక పాత్ర పోషించారని మేకర్స్ అంటున్నారు.

సినిమా ప్రీ రిలీజ్ వేడుక సమయంలో మాట్లాడని త్రివిక్రమ్‌ సక్సెస్ మీట్‌ లో మాత్రం తన ఆనందంను షేర్ చేసుకున్నాడు. గతంలో ఆయన మాటలకు ఈ సారి మాటలకు చాలా వ్యత్యాసం కనిపించింది. తన సొంత సినిమా అని చేసుకున్నాను.. మంచి విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆయన కామెంట్స్ చేశాడు.

సినిమా సక్సెస్‌ అవ్వడం చాలా సంతోషాకన్ని కలిగించిందని త్రివిక్రమ్‌ చెప్పుకొచ్చాడు. ఆయన పడ్డ కష్టంకు.. స్నేహితుడు అయిన పవన్ కు ఒక మంచి సక్సెస్ ఇవ్వాలని పడిన తాపత్రయంకు భీమ్లా నాయక్ సాక్ష్యం అనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News