ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి ఈజీగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. తమిళంలో మెల్ల మెల్లగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ ను బిల్డ్ చేసుకుంటూ ఉండగా ఈమెకు మహానటి సినిమా తో బిగ్ ఛాన్స్ దక్కింది. మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటించడంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. కీర్తి సురేష్ మహానటి తో వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు.. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు మొదలు పెట్టింది. కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు పెంగ్విన్ మొదలుకుని మొన్న విడుదల అయిన గుడ్ లక్ సఖి వరకు ఏ ఒక్కటి కూడా కమర్షియల్ గా ఆమెకు సక్సెస్ ను తెచ్చి పెట్టలేదు. మహానటి సినిమా తో ఆమె పేరుకు తగ్గట్లుగా మహా కీర్తిని దక్కించుకుంది. కాని సినిమా సినిమా కు ఆమె క్రేజ్ తగ్గుతూ వస్తుండటంతో మహానటి కాస్త ఉత్త నటి అయ్యేలా ఉందంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేసే స్థాయికి చేరుకుంది.
మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ చేసిన సినిమాల్లో మన్మధుడు 2.. పెంగ్విన్.. మిస్ ఇండియా.. అన్నాత్తే.. మరక్కర్.. గుడ్ లక్ సఖి ఇలా ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు కమర్షియల్ గా సక్సెస్ ను తెచ్చి పెట్టలేదు. హీరోయిన్ గా ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు మాత్రమే కాకుండా హీరోలతో కలిసి నటించిన సినిమాలు కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. అయినా కూడా ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్ లో ముఖ్యంగా తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోయిన్ గానే ఉంది. అందుకే మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ తో సర్కారు వారి పాట సినిమాను చేసే అవకాశం దక్కించుకుంది. అంతే కాకుండా చిరంజీవి భోళా శంకర్ సినిమా లో ఆయనకు చెల్లి పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇంతటి క్రేజ్ ఉన్న కీర్తి సురేష్ సినిమాల ఎంపిక విషయంలో అలసత్వం చూపించడం వల్లే ఈ ఫలితాలు వస్తున్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఒక వైపు కమర్షియల్ హీరోయిన్ గా మంచి ఆఫర్లు వస్తున్న సమయంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం అంటే చాలా పెద్ద సాహసం. ఎందుకంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు సౌత్ లో ఆడటం చాలా అరుదుగా జరుగుతుంది. కనుక మహానటి వంటి గొప్ప కథలు లేదా గొప్ప సినిమాలు అయితే పర్వాలేదు కాని ఏ కథను పడితే ఆ కథను ఒప్పుకుని సినిమాలు చేస్తే ఉన్న క్రేజ్ కూడా పోతుంది అని కీర్తి సురేష్ కు మూడు నాలుగు సినిమాల అనుభవం తర్వాత తెలిసి ఉంటుంది. కీర్తి సురేష్ ఇకపై కొంత కాలం వరకు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు దూరంగా ఉండటం బెటర్ అంటూ అభిమానులు సలహా ఇస్తున్నారు.
మహానటి మళ్లీ మహా క్రేజ్ ను దక్కించుకోవాలంటే ఖచ్చితంగా ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలు సక్సెస్ అవ్వడం మాత్రమే కాకుండా తర్వాత తర్వాత చేయబోతున్న సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలి. అప్పుడే మహానటి క్రేజ్ కంటిన్యూ అవుతుంది. ఇకపై అయిన కథల ఎంపిక విషయంలో పాత్రల ఎంపిక విషయంలో ఆర్థిక పరమైన విషయాలు కాకుండా ఇతర విషయాలను కూడా చూసుకోవాలంటూ నెటిజన్స్ ముఖ్యంగా సినీ విశ్లేషకులు ఆమెకు సలహా లు ఇస్తున్నారు.