ట్విట్టర్ క్రాష్.. 'గుడ్ జాబ్ వారియర్స్' అని మెచ్చుకున్న సుశాంత్ సోదరి..!
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ యొక్క అకాల మరణం చెంది మూడున్నర నెలలు దాటుతున్నా అతని అభిమానులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు సుశాంత్ కి న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూనే ఉన్నారు. సుశాంత్ కేసులో రోజుకొక విషయం వెలుగులోకి వస్తున్నా.. సీబీఐ దర్యాప్తు చేసినా.. ఈడీ విచారించినా.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగినా.. వారు మాత్రం ఉద్యమాన్ని ఆపలేదు. ప్రతిరోజూ సోషల్ మీడియా వేదికగా సుశాంత్ కి న్యాయం జరగాలంటూ పోస్టులు పెడుతూ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న (గురువారం) ట్విట్టర్ లో #Revolution4SSR అనే హ్యాష్ ట్యాగ్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ చెసారు. ట్విట్టర్ లో 1.5 మిలియన్లకు పైగా ట్వీట్లతో ట్రెండింగ్ టాపిక్స్ లో ఒకటిగా హ్యాష్ ట్యాగ్ కొనసాగింది. దీని కారణంగా గురువారం సాయంత్రం ట్విట్టర్ ప్రపంచవ్యాప్త అంతరాయాన్ని ఎదుర్కొంది.
ఇదే విషయాన్ని సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ 'సత్యం కోసం న్యాయం కోసం పోరాడుతున్న ఐక్యత స్వరం’ అని పోస్ట్ పెట్టింది. 'ట్విట్టర్ సామర్థ్యం కంటే ఎక్కువ. దయచేసి కొన్ని క్షణాలు వేచి ఉండి మళ్ళీ ప్రయత్నించండి' అనే స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. ''ట్విట్టర్ కాసేపు క్రాష్ అయిందని విన్నాను.. ఇది నిజం కోసం న్యాయం కోసం పోరాడుతున్న ఐక్యత స్వరం.. అన్ని కోణాల్లోనూ ఇది నిజమైన విప్లవం! గుడ్ జాబ్ వారియర్స్.. దాన్ని కొనసాగించండి.. టేక్ ఏ బౌ'' అని శ్వేతా సింగ్ కీర్తి పేర్కొంది. దీనికి ముందు 'మాకు సిబిఐపై నమ్మకం ఉంది. మేము నిజం తెలుసుకోడానికి ఒక అంగుళం దగ్గరగా ఉన్నాం! రాబోయే కొద్ది రోజులు కీలకం.. మనకు కొన్ని శుభవార్తలు వినవచ్చు. దేవుడు ఖచ్చితంగా మనతో ఉన్నాడని నాకు తెలుసు. మేము #Revolution4SSR కి పిలుపునిస్తున్నాం. మీరు మాతో ఉన్నారా?' అని పోస్ట్ పెట్టింది.