'లక్ష్మీస్ ఎన్టీఆర్'... ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం. వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతోంది. మొదటి నుండి కూడా వర్మ ఈ చిత్రం మొత్తం కూడా లక్ష్మీ పార్వతి సెంటర్ గా నడుస్తుందని, లక్ష్మీ పార్వతి ఎంట్రీ తర్వాత ఎన్టీఆర్ ను ఆయన కుటుంబ సభ్యులు ఎలా చూశారు, ఆ పరిణామాలు ఏంటీ అనే విషయాన్ని తాను చూపించబోతున్నట్లుగా వర్మ చెబుతూ వచ్చాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంకు వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని తాజాగా ట్రైలర్ విడుదల నేపథ్యంలో ఈ చిత్రానికి మరొకరితో కలిసి తాను తెరకెక్కించాను అంటూ వర్మ చెప్పకనే చెప్పాడు.
ట్రైలర్ లో డైరెక్టెడ్ బై రామ్ గోపాల్ వర్మ మరియు అగస్త్య మంజు అంటూ టైటిల్ కార్డు వేశాడు. మామూలుగా అయితే వర్మ సొంతంగానే అన్ని సినిమాలను తెరకెక్కిస్తాడు. కాని ఈ చిత్రంను మాత్రం అగస్త్య మంజుతో కలిసి తెరకెక్కించాడనికి కారణం ఏమై ఉంటుందా అంటూ చర్చలు జరుగుతున్నాయి. ఇంతకు ఈ అగస్త్య ఎవరు అనే విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ లో సినిమాలో ఏం చూపించబోతున్నాడో వర్మ పూర్తిగా చూపించేశాడు. చంద్రబాబు నాయుడు మరియు నందమూరి ఫ్యామిలీని టార్గెట్ గా చేసి వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం సెన్షేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. చాలా కాలంగా సాలిడ్ హిట్ లేక ఇబ్బందులు పడుతున్న వర్మకు ఈ చిత్రం సక్సెస్ ను ఇవ్వడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.