రొమాంటిక్ జోడీ మరోసారి చెలరేగేలా!
`ఆశీకీ -2` తో ఆదిత్యరాయ్ కపూర్-శ్రద్దా కపూర్ జోడీ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క హిట్ ఇద్దరికీ కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చింది.
`ఆశీకీ -2` తో ఆదిత్యరాయ్ కపూర్-శ్రద్దా కపూర్ జోడీ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క హిట్ ఇద్దరికీ కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చింది. మ్యూజికల్ లవ్ స్టోరీలో ఎన్నో ఎమోషన్స్ తో దర్శకుడు మోహిత్ సూరి ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అటుపై ఆ కాంబినేషన్ లోనే `ఒకే జాను` అంటూ మరో చిత్రం కూడా రూపొందిన సంగతి తెలిసిందే. అయితే ఇది `ఆశీకీ-2` రేంజ్ లో సక్సెస్ కాలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ముచ్చటగా మూడవ సారి ఈ త్రయం చేతులు కలుపుతుంది. అదిత్యరాయ్ కపూర్- శ్రద్ద కపూర్ తో మోహిత్ సూరి మరో చిత్రానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఇది కూడా రొమాంటిక్ లవ్ స్టోరీ అని సమాచారం. ప్రస్తుతం సూరి స్టోరీ పనుల్లోనే బిజీగా ఉన్నారట. కథలో ఆశీకీ -2 ను మించి బలమైన ఎమోషన్ ఉంటుందని లీకులందుతున్నాయి. మ్యూజికల్ గానూ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్లో ఉంచే చిత్రమవుతుందంటున్నారు.
దీనిలో భాగంగా `ఆశీకీ-2`కి పనిచేసిన సంగీత దర్శకుల్నే తీసుకుంటున్నారట. జీతూ గంగూలీ, మిథూన్, అంకిత్ తివారీ ముగ్గురు ఈ సినిమాకి సంగీతం అందించారు. నేపథ్య సంగీతాన్ని రాజ్ సింగ్ అందించారు. మోహిత్ సూరి ఇప్పుడు ఇదే టీమ్ తో ముందుకెళ్తున్నారట. ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు అతి త్వరలోనే వెల్లడించనున్నారని సమాచారం. `ఏక్ విలన్ రిటర్న్స్` తర్వాత మోహిత్ సూరి ఇంత వరకూ కొత్త సినిమా పట్టాలెక్కించలేదు.
`ఏక్ విలన్` కూడా భారీ విజయం సాధించలేదు. దీంతో మూడేళ్లు గ్యాప్ అనంతరం మళ్లీ కొత్త ప్రాజెక్ట్ తో లైన్ లోకి వచ్చారు. కపూర్ జోడీ తో సినిమా కావడంతో అంచనాలు పీక్స్ కి చేరుతున్నాయి. స్త్రీ2 తో శ్రద్దా కపూర్ ఇటీవల మరో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో అమ్మడి స్టార్ డమ్ రెట్టింపు అయింది. పారితోషికం భారీగా పెంచేసింది. మరి మోహిత్ సూరి లవ్ స్టోరీకి ఎంత ఛార్జ్ చేస్తుందో చూడాలి. పైగా ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాల్లోనూ నటించాల్సి ఉంటుంది. వీటన్నింటికి ఎంత లెక్క కడుతుందో చూడాలి.