హాఫ్ సెంచరీ దాటినా ఈ హీరో రేసింగ్ దూకుడు
అజిత్ రేసింగ్ బృందం X లో అప్‌డేట్‌ను షేర్ చేసారు. వాలెన్సియాలో ప్రాక్టీస్ సమయంలో నటుడు 1:39.9 ల్యాప్ సమయాన్ని సాధించాడని ఈ పోస్ట్ పేర్కొంది.
అతడి వయసు అర్థ సెంచరీ దాటిపోయింది. ఈ వయసులోను రేసింగులు అదరగొడుతున్నాడు. రేస్ ట్రాక్‌పై అజిత్ రికార్డులను బద్ధలు కొడుతున్నాడు. ఇంతకుముందు దుబాయ్ కార్ రేస్ ఈవెంట్లో గెలుపొందాడు. స్పెయిన్‌లో అతడి తాజా విజయం వేగంలో తళాకు ఎవరూ సాటిలేరని నిరూపణ అయింది. సుమారు 15 సంవత్సరాల తర్వాత కార్ రేసింగ్ లో దుమ్ముదులిపేస్తున్నాడు అజిత్. మోటార్‌స్పోర్ట్స్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ప్రతిష్టాత్మకమైన దుబాయ్ రేసులో అదరగొట్టాక, అజిత్ అతడి బృందం పోర్చుగల్‌లోని పోర్స్చే స్ప్రింట్ ఛాలెంజ్‌లోకి ప్రవేశించారు. అక్కడ అతడు 1.49.13 సెకన్ల వ్యక్తిగత ఉత్తమ ల్యాప్ సమయాన్ని సాధించాడు. ప్రస్తుతం స్పెయిన్‌లోని వాలెన్సియా సర్క్యూట్‌లో సిద్ధమవుతున్న అజిత్ ప్రతి ల్యాప్‌తో ప్రోత్సహించబడిన తన పరిమితులను ముందుకు తీసుకెళ్తున్నాడు.
అజిత్ రేసింగ్ బృందం X లో అప్‌డేట్‌ను షేర్ చేసారు. వాలెన్సియాలో ప్రాక్టీస్ సమయంలో నటుడు 1:39.9 ల్యాప్ సమయాన్ని సాధించాడని ఈ పోస్ట్ పేర్కొంది.ఏకే పరిమితులు దాటి సమయం తగ్గించుకుని, వేగం పెంచుతూనే ఉన్నాడు. ట్రాక్‌పై మునుపటిలా ఎలాంటి పొరపాట్లు జరగలేదు.
అంత వేగంలోను దోషరహితంగా అతడు దూసుకెళుతున్నాడు. రేసింగ్ సీజన్ ముగిసే వరకు తాను కొత్త సినిమా ప్రాజెక్టులను చేపట్టబోనని అజిత్ స్పష్టం చేశారు. అయితే అక్టోబర్ - మార్చి మధ్య అజిత్ మరో సినిమాలో నటించవచ్చని కథనాలొస్తున్నాయి. అప్పటి వరకు, రేస్ ట్రాక్‌పై అతడు యథేచ్ఛగా ప్రయోగాలు చేసేందుకు ఆస్కారం ఉంది.