విశాల్ హెల్త్ పై వస్తున్న వార్తల్లో ఏది నిజం..!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హెల్త్ పై కోలీవుడ్ లో రకరకాల ప్రచారం జరుగుతుంది. తెలుగు మూలాలున్న విశాల్ తమిళ హీరోగా సత్తా చాటుతూ వచ్చాడు.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హెల్త్ పై కోలీవుడ్ లో రకరకాల ప్రచారం జరుగుతుంది. తెలుగు మూలాలున్న విశాల్ తమిళ హీరోగా సత్తా చాటుతూ వచ్చాడు. విశాల్ సినిమా రిలీజ్ అంటే అటు తమిళ్ ఆడియన్స్ తో పాటుగా తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఉంటారు. తన మార్క్ సినిమాలతో విశాల్ ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని అలరించే ప్రయత్నం చేస్తాడు. ఐతే విశాల్ ఈమధ్య హెల్త్ ఇష్యూస్ తో బాధ పడుతున్నాడు. రీసెంట్ గా మగ గజ రాజ సినిమా ఈవెంట్ లో విశాల్ మైక్ ని కూడా మోయలేని విధంగా వణుకుతున్న చేతులతో కనిపించాడు.
ఐతే విశాల్ కి హై ఫీవర్ వల్ల అసలేమాత్రం ఓపిక లేదని దాని వల్లే అతను అలా కనిపించాడని అన్నారు. కేవలం ఫీవర్ వల్లే కాదని కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఒక సినిమా షూటింగ్ లో విశాల్ చెట్టుపై నుంచి కింద పడినప్పటి నుంచి అతని హెల్త్ సరిగా లేదని అంటున్నారు. కోలీవుడ్ హీరో విశాల్ బాల డైరెక్షన్ లో అవన్ ఇవన్ అదే వాడు వీడు సినిమా చేశాడు. ఆ సినిమా టైం లోనే విశాల్ చెట్టు మీద నుంచి కింద పడ్డాడు. 2011 లో ఆ ఇన్సిడెంట్ జరిగింది దాని ఎఫెక్ట్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో చూపిస్తుందని తెలుస్తుంది.
ఆ టైం లోనే బ్రెయిన్ లో నరాలు దెబ్బ తిని తరచు తలనొప్పి ఆకలి ఉండకుండా అవుతుందట. ఇది రిపీటెడ్ గా అవుతుందని తెలుస్తుంది. ఎంత ట్రీట్ మెంట్ తీసుకున్నా అది తగ్గలేదని ప్రస్తుతం అది తీవ్ర స్థాయికి చేరడం వల్లే విశాల్ ఇలా మారాడని అంటున్నారు. ఐతే నిజంగానే విశాల్ కి అంత పెద్ద సమస్య ఉందా బ్రెయిన్ లో నరాలు దెబ్బతిన్నాయా అన్నది అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
విశాల్ హెల్త్ ఇష్యూపై మీడియా అత్యుత్సాహం చూపిస్తుంది. ఐతే అసలు ఏం జరిగింది అన్నది పక్కన పెడితే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రాస్తున్నారు. అసలు విషయం ఏంటన్నది విశాల్ టీం స్పందించాల్సి ఉంటుంది. ఐతే విశాల్ మద గజ రాజా సినిమా ఈవెంట్ కి రావడం వల్లే అతని అనారోగ్య సమస్య గురించి బయటకు తెలిసింది. ఆ ఈవెంట్ లో విశాల్ ని చూసి ఆయన ఫ్యాన్స్ షాక్ అయ్యారు.