వినాయక చవితి కానుకగా విడుదలైన సినిమాల్లో ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రమే. దీంతో పోలిస్తే ‘యూ టర్న్’కు అంత హైప్ లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడం.. పైగా థ్రిల్లర్ జానర్ కావడంతో ఎక్కువమంది ప్రేక్షకులు దీనిపై దృష్టిపెట్టలేదు. కానీ రిలీజ్ తర్వాత మాత్రం దీనికి మంచి టాక్ వచ్చింది. రివ్యూలకు తోడు మౌత్ పబ్లిసిటీ బాగా పని చేసింది. తొలి రోజు తొలి రెండు షోలు డల్లుగా నడిచినా.. సాయంత్రం నుంచే వసూళ్లు పుంజుకున్నాయి. వీకెండ్లో ఈ చిత్రం మంచి వసూళ్లే రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యుఎస్ లోనూ ఈ చిత్రం భలేగా పుంజుకుంది.
బుధవారం ఈ చిత్రానికి ప్రిమియర్లు వేస్తే రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేదు. 10 వేల డాలర్లు మాత్రమే వసూలయ్యాయి. ఆ రోజు అక్కడి జనా దృష్టంతా ‘శైలజా రెడ్డి అల్లుడు’ మీదే ఉంది. కానీ మరుసటి రోజు టాక్ బయటికి వచ్చాక పరిస్థితి మారింది. ‘యూ టర్న్’ రైజ్ అయింది. వరుసగా మూడు రోజుల్లో 28 వేలు.. 59 వేలు.. 82 వేల డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా శనివారం నాటికి 1.8 లక్షల డాలర్లు వసూలయ్యాయి. అంటే రూపాయల్లో రూ.1.3 కోట్లన్నమాట. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఈ వసూళ్లు పెద్ద మొత్తమే. ఇప్పటికే ఈ చిత్రం అక్కడ లాభాల బాట పట్టింది. ఫుల్ రన్లో ఈ చిత్రం సులువుగా 3 లక్షల డాలర్ల మార్కును దాటే అవకాశముంది. తెలుగు.. తమిళ భాషల్లో కలిపి ఈ చిత్రం రూ.10 కోట్ల షేర్ మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు.